News November 5, 2025

HYD: 19 మంది చనిపోయినా గుంత పూడ్చలే?

image

చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన గుంతను పూడ్చే విషయంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. యాక్సిడెంట్ నేపథ్యంలో ఈ గుంతను మంగళవారం ఉదయం డస్ట్‌తో పూడ్చారు. సాయంత్రం డస్ట్ అంతా కొట్టుకుపోయి మళ్లీ గుంత యథాస్థితికి వచ్చింది. రాత్రి సమయంలో ఈ గుంత ప్రమాదకరంగా కనిపించింది. ఇంత ఘోరం జరిగినా అధికార యంత్రాంగంలో చలనం లేకపోవడం గమనార్హం.

Similar News

News November 5, 2025

శివాలయంలో ఎస్పీ రోహిత్ రాజ్ ప్రత్యేక పూజలు

image

అన్నపురెడ్డిపల్లి శివాలయాన్ని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ సందర్శించారు. కార్తీక్ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. ఆయన వెంట కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.

News November 5, 2025

రెండో పెళ్లి రిజిస్టర్ చేయాలంటే మొదటి భార్య వాదన వినాలి: HC

image

ముస్లిం పర్సనల్ లా ప్రకారం పురుషుడి బహుభార్యత్వానికి అనుమతి ఉంది. అయితే మొదటి భార్య బతికి ఉండగా చేసుకొనే రెండో పెళ్లిని గుర్తించాలంటే అధికారులు కొన్ని నిబంధనలు పాటించాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ పెళ్లిని రిజిస్టర్ చేసే ముందు మొదటి భార్య అంగీకారం ఉందో లేదో పరిగణనలోకి తీసుకోవాలంది. ‘ఇలాంటి సందర్భాల్లో మతాచారాలు సెకండరీ. రాజ్యాంగ హక్కులే సుప్రీం’ అని జస్టిస్ PV కున్హికృష్ణన్ పేర్కొన్నారు.

News November 5, 2025

కార్తీకం: పునర్జన్మను ప్రసాదించే పవిత్ర స్తోత్రాలివే

image

కార్తీక మాసంలో లక్ష్మీ స్తోత్రం, కనకధార స్తోత్రం, విష్ణు స్తోత్రం పఠించడం వలన విశేషమైన ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ఈ స్తోత్ర పారాయణం ద్వారా శ్రేయస్సు, ఆనందాన్ని పొందుతారని అంటున్నారు. ‘ఈ మాసంలో పద్ధతులను నిష్ఠగా పాటించే భక్తులు మరణానంతరం ఉత్తమ లోకంలో స్థానాన్ని సంపాదించుకుంటారు. పునర్జన్మను పొందుతారు. జీవించి ఉన్నంత కాలం కుటుంబంతో సంతోషకరమైన, సుఖమయమైన జీవితాన్ని గడపవచ్చు’ అంటున్నారు.