News August 25, 2025
HYD: 1973లో ‘గణపతి’యాత్ర.. నేడు వరల్డ్ రికార్డు స్థాయికి

షిర్డీ యాత్రలో 1973లో కొన్న చిన్న వినాయకుడి విగ్రహంతో ప్రారంభమైన సికింద్రాబాద్ వాసి శేఖర్ భక్తి నేడు ప్రపంచ రికార్డు స్థాయికి చేరింది. సాధారణంగా అందరూ స్టాంపులు, నాణేలు సేకరిస్తే, ఆయన మాత్రం 21,708 గణేశుడి విగ్రహాలు, గణపయ్యకు సంబంధించిన 19,558 పోస్ట్‌కార్డులు, ఫొటోలు 14,950, పోస్టర్లు 11,005, కీ చైన్లు 250, ఆడియో, వీడియోలు 250తో కలిపి మొత్తం 58,748 సేకరించారు. ఇది హాబీ కాదు జీవిత మిషన్ అన్నారు.
Similar News
News August 25, 2025
మహానగరంలో రక్తచరిత్ర.. వారంలో 2 దారుణ హత్యలు

మహానగరం హత్యలతో ఉలిక్కిపడుతోంది. రక్తపు చారలతో మైల పడుతోంది. వారం రోజుల్లోనే 2 దారుణ హత్యలు జరిగాయి. 18వ తేదీన కూకట్‌పల్లిలో సహస్ర (12)ను 10వ తరగతి విద్యార్థి దారుణంగా కత్తితో పొడిచి హత్య చేయగా.. 23న బోడుప్పల్‌లో మహేందర్‌రెడ్డి తన భార్య స్వాతి(21)ని అత్యంత దారుణంగా చంపి శరీరాన్ని ముక్కలు చేసి మూసీలో పడేశాడు. అత్యంత పాశవికంగా జరిగిన ఈ హత్యలతో మానవత్వం ఏమైపోతోందంటూ పలువురు మండిపడుతున్నారు.
News August 25, 2025
నిర్బంధాల నడుమ ఓయూలో సీఎం పర్యటన: BRSV

సీఎం రేవంత్ రెడ్డి నిర్బంధాల నడుమ ఉస్మానియా యూనివర్సిటీని సందర్శిస్తున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ మండిపడ్డారు. సీఎం పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులలో భాగంగా ఆయనను అంబర్‌పేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికారం కోసం హామీలు ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసి, ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు.
News August 25, 2025
HYD: 70 మంది పోకిరీల పనిపట్టిన షీ టీమ్స్

మహానగరంలో పోకిరీల బెడద నుంచి కాపాడాలని సైబరాబాద్ షీ టీమ్స్‌కు పలువురు ఫోన్ చేసే సహాయం అర్థిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు షీటీమ్స్ సిబ్బంది 143 డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించారు. అసభ్యకరంగా వేధిస్తున్న 70 మందిని పట్టుకున్నట్లు డీసీపీ సృజన కరణం తెలిపారు. అంతేకాక 34 మంది భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వివరించారు. బాధితులు 181, 1098కు ఫోన్ చేసి చెప్పాలని ఈ సందర్భంగా సూచించారు.