News October 28, 2025

HYD: 2 గంటలకుపైగా సోషల్ మీడియాలోనే

image

నేషనల్ వెబ్ ఇండెక్స్ సర్వే ప్రకారం నగర యువత రోజుకు 2 గంటలకుపైగా సోషల్ మీడియాలో గడిపేస్తున్నట్లు తేలింది. ఫ్యామిలీ పంచాయితీలు, వివరాలు అన్నీ ఇందులో పెట్టేస్తూ లేనిపోని వ్యవహారల్లో తలదూరుస్తున్నట్లు తేలింది. SMను సమాచారం కోసం కాకుండా వినోదం, కొత్త ఫ్రెండ్స్‌తో ఛాటింగ్‌కు ఓపెన్ చేస్తున్నట్లు తేలింది. దీంతో చదువు అటకెక్కుతుందని, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదని, SMపై నియంత్రణ అవసరమని సూచించారు.

Similar News

News October 28, 2025

HYDలోనూ పెరుగుతున్న లగ్జరీ హౌసెస్!

image

భారతదేశంలోని విలాసవంతమైన నగరాల్లో లగ్జరీ గృహాల విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే తర్వాత HYD, చెన్నై, కోల్‌కత్తా వంటి 7 ప్రధాన నగరాల్లో 2025 జనవరి నుంచి జూన్ వరకు సుమారు 55,640 లగ్జరీ గృహాలు విక్రయమైనట్లు ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ గుణాంకాలు తెలిపాయి. మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలు మెరుగవడం ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

News October 28, 2025

మహా ప్రస్థానంలో సత్యనారాయణ రావు అంత్యక్రియలు పూర్తి

image

మాజీమంత్రి హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కోకాపేటలోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమై.. మహా ప్రస్థానం వద్ద ముగిసింది. అంతిమయాత్రలో మాజీమంత్రి కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కార్యకర్తల కన్నీటి వీడుకోలు మధ్య సత్యనారాయణ రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. హరీశ్ రావు తన తండ్రి సత్యనారాయణ రావు చితికి నిప్పంటించి, దహన కార్యక్రమాలు పూర్తి చేశారు.

News October 28, 2025

HYD మెట్రో కోసం మూతబడ్డ మున్షీనాన్

image

మున్షీనాన్.. పాతబస్తీలో ఈ పేరు తెలియని వారు ఉండరు. 174 ఏళ్లుగా నడిచిన నాన్ షాపును HYD మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ఇటీవల తొలగించారు. నిజాం వద్ద క్లర్క్‌గా పనిచేసే మున్షీ ఢిల్లీ వీధుల్లో నిప్పుల కొలిమితో చేసిన చతురస్త్ర ఆకారపు రొట్టెకు ఫిదా అయ్యారు. అచ్చం అలానే చార్మినార్‌లో 1851లో మున్షీనాన్ ఏర్పాటు చేశారు. జనాదరణతో మున్షీనాన్ నగరవ్యాప్తమైంది. 2025 మెట్రో పనుల్లో భాగంగా ఈ దుకాణం కనుమరుగైంది.