News August 24, 2024
HYD: 20 మంది మాయగాళ్లు.. 900 కేసులు

పార్ట్ టైం జాబ్స్, షేర్ మార్కెట్, ఫెడెక్స్ కొరియర్తో బెదిరింపులు.. ఇలా గుజరాత్ ముఠాలు దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నాయి. తరచూ చిరునామా మార్చుతూ పోలీసులను ఏమార్చటం వీరి ప్రత్యేకత. సైబర్ క్రైమ్ పోలీసులు 7 బృందాలుగా ఏర్పడి గుజరాత్లో మకాం వేసి నేరస్థులను గుర్తించారు. 20 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిపై మన రాష్ట్రంలోనే 100కు పైగా కేసులు ఉన్నాయని తెలుస్తోంది.
Similar News
News November 12, 2025
LLM స్పాట్ అడ్మిషన్లకు గైడ్లైన్స్ విడుదల

రాష్ట్రవ్యాప్తంగా LLM కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లకు అధికారులు గైడ్లైన్స్ విడుదల చేశారు. అడ్మిషన్లు మెరిట్ ఆధారంగానే నిర్వహిస్తామన్నారు. కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లకు నోటిఫికేషన్ గురువారం విడుదల చేస్తామన్నారు. కాలేజ్ లింక్ ద్వారా స్పాట్ రిజిస్ట్రేషన్లను 17వ తేదీ వరకు చేసుకోవాలని, సీట్ల కేటాయింపు జాబితాను 18న విడుదల చేస్తామని, 19వ తేదీ మ.12 గంటల వరకు కళాశాలలో రిపోర్టు చేయాలన్నారు.
News November 12, 2025
HYD: DEC 3 నుంచి టీజీసెట్ హాల్ టికెట్లు

రాష్ట్రవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్షిప్నకు అర్హత సాధించేందుకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ సెట్)- 2025 పరీక్ష హాల్ టికెట్లను వచ్చే నెల 3వ తేదీ నుంచి తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని సెట్ మెంబర్ సెక్రెటరీ ప్రొఫెసర్ బి.శ్రీనివాస్ తెలిపారు. 29 సబ్జెక్టుల పరీక్షలను వచ్చే నెల 10వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తామని స్పష్టంచేశారు.
News November 12, 2025
సచివాలయంలో 134 మంది ఆఫీసర్స్ బదిలీ

సచివాలయం సంచలన నిర్ణయం తీసుకుంది. 134 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ సీఎస్ కె.రామకృష్ణ రావు ఉత్తర్వూలు జారీ చేశారు. పుష్కర కాలంగా ఒకే శాఖలో సేవలందిస్తున్న ASOలకు ఈసారి స్థానచలనం కల్పించారు. ఈ బదిలీలు సచివాలయంలో గమనించదగిన మార్పులుగా చెప్పొచ్చు.


