News August 24, 2024
HYD: 20 మంది మాయగాళ్లు.. 900 కేసులు
పార్ట్ టైం జాబ్స్, షేర్ మార్కెట్, ఫెడెక్స్ కొరియర్‌తో బెదిరింపులు.. ఇలా గుజరాత్ ముఠాలు దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నాయి. తరచూ చిరునామా మార్చుతూ పోలీసులను ఏమార్చటం వీరి ప్రత్యేకత. సైబర్ క్రైమ్ పోలీసులు 7 బృందాలుగా ఏర్పడి గుజరాత్‌లో మకాం వేసి నేరస్థులను గుర్తించారు. 20 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిపై మన రాష్ట్రంలోనే 100కు పైగా కేసులు ఉన్నాయని తెలుస్తోంది.
Similar News
News September 19, 2024
బీసీ విదేశీవిద్యకు దరఖాస్తుల ఆహ్వానం
మహాత్మ జ్యోతిరాబా ఫులే విదేశీ విద్యా పథకం కింద ఫాల్ సీజన్‌కు అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు అక్టోబరు 15లోగా ‘ఈ పాస్’ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలని, ఇంజినీర్, మేనేజ్‌మెంట్, సైన్స్, వ్యవసాయం, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, అగ్రికల్చర్, హ్యుమానిటీస్‌లో 60% మార్కులు సాధించాలని పేర్కొన్నారు.
News September 19, 2024
BREAKING..HYD: టెండర్లు ఆహ్వానిస్తున్న హైడ్రా
కూల్చివేతల వ్యర్థాల తొలగింపునకు హైడ్రా టెండర్లు ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తున్నట్లు తెలిపింది. నేటి నుంచి ఈనెల 27 వరకు బిడ్లు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 23 చోట్ల 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన విషయాన్ని ఇదివరకే ప్రకటించింది.
News September 19, 2024
HYD: పాత నేరస్థులతో ముఠా ఏర్పాటు.. వేషాలు మార్చి చోరీలు
<<14135182>>మారు వేషాలతో<<>> చోరీలకు పాల్పడుతున్న ముఠా పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. నిందితుడు సుధాకర్(33) నంద్యాల నుంచి ఇక్కడికి వచ్చి ఆటో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. ఓ కేసులో జైలుకెళ్లి అక్కడ పాత నేరస్థుడు బండారిని కలిసి మరికొంత మందితో గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. వారు మహిళల్లా వేషాలు మార్చి చోరీలకు పాల్పడి సొత్తును సోదరుడు సురేశ్‌కు ఇచ్చి నగదు రూపంలోకి మర్చుకునేవారని తెలిపారు.