News January 8, 2025
HYD: 2024లో జైళ్లకు 41,138 మంది ఖైదీలు: డీజీ
2024లో వివిధ కేసుల్లో జైలుకు వచ్చిన వారి సంఖ్య భారీగా పెరిగిందని, ఈ ఏడాదిలో 41,138 మంది జైలుకు వచ్చారని ఆ శాఖ డీజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు. HYDలో సౌమ్య మిశ్రా జైళ్ల వార్షిక నివేదికను విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. 2024లో హత్యకేసుల్లో 2,754 మంది శిక్ష అనుభవిస్తున్నట్లు తెలిపారు. 2024లో పోక్సో కేసుల్లో 3,655 మంది పురుషులు, 94 మంది మహిళలు జైళ్లలో ఉన్నట్లు చెప్పారు.
Similar News
News January 10, 2025
HYD: RTC స్పెషల్ బస్సులపై ఛార్జీల పెంపు
రేపటి నుంచి సంక్రాంతికి ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తెలిపింది. జనవరి 10, 11,12,19,20 తేదీల్లో స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వ జీవో 16 ప్రకారం 50% వరకు ఛార్జీల పెంపు అమలులో ఉంటుందని పేర్కొంది. HYDలో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.
News January 9, 2025
ఓయూలో ఏడుగురికి అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతి
ఉస్మానియా యూనివర్సిటీ పనిచేస్తున్న ఏడుగురు ఆఫీస్ సూపరింటెండెంట్లను అసిస్టెంట్ రిజిస్ట్రార్ (ఏఆర్)లుగా, ఒక ఏఆర్కు డిప్యూటీ రిజిస్ట్రార్గా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు వారికి ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం.కుమార్ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
News January 9, 2025
ఓయూ అధ్యాపకుల ప్రమోషన్లకు నోటిఫికేషన్ విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులకు కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్) కింద పదోన్నతులు కల్పించేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న అధ్యాపకులు ఈ నెల 25వ తేదీలోగా సంబంధిత ధ్రువపత్రాలతో కలిసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందేందుకు అవకాశం ఉంటుంది.