News December 19, 2024
HYD: 2025లో పదవి విరమణ పొందే IPSలు వీరే!

త్వరలో తెలంగాణ రాష్ట్ర క్యాడర్ చెందిన ఐపీఎస్ అధికారులు ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈ జాబితాలో ముగ్గురు డీజీపీలు ఉన్నారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్త, రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి, హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ ఉన్నారు. 2025లో వీరు పదవి విరమణ పొందనున్నారు.
Similar News
News November 30, 2025
రంగారెడ్డి: మొదటి రోజు 450 నామినేషన్లు

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు కందుకూరు, చేవెళ్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 450 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అందులో 178 పంచాయతీ స్థానాలకు 152 నామినేషన్ దాఖలు కాగా 1540 వార్డు స్థానాలకు 298 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.
News November 30, 2025
HYD: సీఎం పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన కవిత

సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 1 నుంచి 9 వరకు జిల్లాల్లో పర్యటించనున్నారు. దీనిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. “ఎన్నికలు గ్రామాల్లో ఉంటే, సీఎం జిల్లా కేంద్రాలకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారట. ప్రజలను ప్రభుత్వ సొమ్ముతో తరలించడం ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమే. ఎన్నికల కమిషన్ సీఎం పర్యటనను నిలిపివేయాలి” అని డిమాండ్ చేశారు.
News November 30, 2025
రంగారెడ్డి జిల్లాలో సర్పంచ్‌లకు 929 నామినేషన్లు

తొలి విడత పంచాయతీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగిసింది. ఆదివారం నుంచి రెండో విడత మొదలుకానుంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా రెండు డివిజన్లు, ఏడు మండలాల పరిధిలోని 174 సర్పంచ్ స్థానాలు, 1,530 వార్డులకు నామినేషన్లను ఆహ్వానించగా.. సర్పంచ్‌కు 929 నామినేషన్లు, వార్డులకు 3,327 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, డిసెంబర్ మూడో తేదీలోపు నామినేషన్ల ఉపసంహరణ కొనసాగనుంది.


