News January 1, 2026

HYD: 2026.. మన స్టైల్లో ఎంజాయ్ చేద్దాం!

image

అతిగా ఆలోచించి బుర్ర పాడుచేసుకునే రోజులకు Gen Z చెక్ పెడుతోంది. స్క్రోలింగ్ మానేసి కిక్కు ఇచ్చే Y2K గ్లో-అప్స్, మీమ్ థెరపీ, ఫ్రెండ్స్‌తో గేమింగ్ నైట్స్‌కి యూత్ ఫిక్స్ అయిపోతుంది. మెంటల్ హెల్త్ పాడుచేసే టాక్సిక్ ట్రెండ్స్‌ను ఘోస్ట్ చేస్తూ సస్టైనబుల్ స్నాక్స్, సెల్ఫ్ కేర్ హ్యాక్స్‌తో తమ ‘మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ’ చాటుకుంటున్నారు. ఇలానే 2026 కొత్త ఏడాదిని మన స్టైల్‌లో ఎంజాయ్ చేద్దాం.
Happy New Year

Similar News

News January 1, 2026

HYDలో కొత్త జిల్లా.. త్వరలో ఉత్తర్వులు?

image

రాజధానికి 4 కమిషనరేట్‌లను తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా కొత్త జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కమిషనరేట్ల సరిహద్దులకు సమానంగా సిటీ పరిధిలోని 3 జిల్లాలను 4కు పెంచేలా CM ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. RRను ఫ్యూచర్ సిటీతో రూరల్ జిల్లాగా, అర్బన్ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయనుంది. HYDజిల్లాలోని కంటోన్మెంట్‌ ఏరియాను మల్కాజిగిరిలో కలిపి, శంషాబాద్, రాజేందర్‌నగర్‌ను HYDలో కలపనుందట.

News January 1, 2026

HYDలో బిర్యానీ తిని ఒకరి మృతి.. 15మంది సీరియస్

image

న్యూ ఇయర్ వేడుక విషాదం మిగిల్చింది. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట PS పరిధిలోని భవానినగర్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగి బిర్యానీ తిన్నవారు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు (53) మృతి చెందగా మరో 15 మంది సూరారంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 1, 2026

HYDని ‘బల్దియా’ ఎందుకు అంటారో తెలుసా?

image

GHMCని నగరవాసులు ‘బల్దియా’గా పిలుస్తారు. ఎందుకు ఈ పదం వాడతారో చాలా మందికి తెలియదు. పూర్వం HYDను ‘అత్రాఫ్‌బల్దా’గా పిలిచేవారు. అరబ్బీలో అత్రాఫ్ అంటే ఆవరణ, బల్దా అంటే పట్టణం. అదే అర్థంతో ఉర్దూలో నగర పాలక సంస్థను ‘బల్దియా’గా పిలవడం ప్రారంభమైంది. HYD నగర నిర్మాత మహ్మద్ కులీ కుతుబ్ షా కాలం నుంచే ఈ పదం వాడుకలోకి వచ్చింది. ఆసఫ్‌జాహీల పాలనలో ఉర్దూ అధికార భాష కావడంతో ‘బల్దియా’ ప్రజల నోట నాటుకుపోయింది.