News March 7, 2026
HYD: 2026-27 నుంచి NEP 2020 అమలు

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వి. బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉపకులపతుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ, పీజీ కోర్సుల్లో జాతీయ విద్యా విధానం (NEP 2020) అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి CPGET ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతను కాకతీయ విశ్వవిద్యాలయానికి అప్పగించినట్లు పేర్కొన్నారు.
Similar News
News March 7, 2026
లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం: అన్నమయ్య కలెక్టర్

లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని చేసినవారు, చేయించుకున్నవారు, ప్రోత్సహించిన వారు, చట్టప్రకారం శిక్షకు అర్హులని జిల్లా కలెక్టర్, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం జిల్లా ఛైర్మెన్ నిషాంత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి పీసీపీ ఎన్డీటీ చట్టం అమలు పైన కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశంచేశారు.
News March 7, 2026
విజయవాడలో దొరికిన తుపాకీ అక్కడిదే..!

విజయవాడలో అక్రమంగా తుపాకీ కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీసీపీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. శనివారం పోలీసులు బాలాజీ హోటల్ వద్ద తనిఖీలు నిర్వహించగా, వరంగల్‌కు చెందిన మురళి పటేల్ పట్టుబడ్డాడు. నిందితుడు బీహార్‌లో తుపాకీ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అతని వద్ద నుంచి ఒక తుపాకీ, ఐదు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే ఆయుధాన్ని తెచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
News March 7, 2026
భీకర దాడి.. 47 మంది మృతి

ఇరాన్‌తోపాటు లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇవాళ ష్ముస్టార్, నబీ చిట్ పట్టణాలపై చేసిన ఎయిర్‌స్టైక్స్‌లో 47 మంది మరణించినట్లు లెబనీస్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో ఎక్కువ మంది పౌరులేనని తెలిపింది. మరో 40 మంది గాయపడినట్లు పేర్కొంది. కాగా 2023 OCT నుంచి లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 4వేల మందికి పైగా మరణించగా, దాదాపు 17వేల మంది గాయపడినట్లు సమాచారం.


