News February 23, 2025
HYD: 2030 నాటికి 1.27 కోట్ల జనాభా..!

జీహెచ్ఎంసీ పరిధిలో జనాభా వేగంగా పెరుగుతోంది. వివిధ సర్వేల ప్రకారం, ప్రస్తుతం 1.08 కోట్లు ఉన్న జనాభా 2030 నాటికి 1.27 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ పెరుగుదల దృష్ట్యా రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ట్రాన్స్పోర్ట్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. HYD నగర విస్తరణతో పాటు సమతుల్య ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడ్డారు.
Similar News
News December 4, 2025
ఇష్టారీతిన అనుమతులు.. ప్రైవేటుకు విక్రయిస్తున్న వైనం..!

ప్రభుత్వ పనుల పేరిట ఇసుక రవాణా అనుమతి పొందిన ట్రాక్టర్ల యజమానులు ఇసుకను ప్రైవేటుకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వేములవాడ జడ్పీ బాలికల హైస్కూల్ ఆవరణలో లైబ్రరీ, కంప్యూటర్ గది నిర్మాణం పనులు నిధుల కొరత కారణంగా మూడు నెలలుగా నిలిచిపోయినప్పటికీ, 16 ట్రిప్పుల ఇసుక రవాణాకు అనుమతి పొందిన ఓ ట్రాక్టర్ యజమాని దానిని కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్కు విక్రయించిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.
News December 4, 2025
గ్లోబల్ సమ్మిట్: ప్రజలకు ఉచిత ప్రవేశం!

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను పబ్లిక్కు చేరువ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 10 నుంచి 13 వరకు హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగే ఈ సదస్సులో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నామని తెలిపింది. ప్రభుత్వ ప్రాజెక్టులు, నిపుణులతో సెషన్లు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించింది. JBS, MGBS నుంచి ఉచితంగా బస్సు సౌకర్యం కూడా అందించనుంది.
News December 4, 2025
CBN దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారు: జగన్

AP: సీఎం చంద్రబాబు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని YCP చీఫ్ జగన్ విమర్శించారు. శ్రీవారిని ఆయన అభాసుపాలు చేశారని దుయ్యబట్టారు. ‘నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందన్నారు. ఆ నెయ్యితో చేసిన లడ్డూలు భక్తులు తిన్నారనడానికి ఆధారాలు దొరికాయా? కల్తీ నెయ్యి ట్యాంకర్లు ప్రసాదం తయారీలోకి వెళ్లాయా? ప్రతి ట్యాంకర్ను క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఈ క్రమంలో తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడుంది’ అని ప్రశ్నించారు.


