News February 23, 2025
HYD: 2030 నాటికి 1.27 కోట్ల జనాభా..!

జీహెచ్ఎంసీ పరిధిలో జనాభా వేగంగా పెరుగుతోంది. వివిధ సర్వేల ప్రకారం, ప్రస్తుతం 1.08 కోట్లు ఉన్న జనాభా 2030 నాటికి 1.27 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ పెరుగుదల దృష్ట్యా రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ట్రాన్స్పోర్ట్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. HYD నగర విస్తరణతో పాటు సమతుల్య ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడ్డారు.
Similar News
News February 23, 2025
HYD: పిల్లలపై పెరుగుతున్న అఘాయిత్యాలు..!

గ్రేటర్ HYD పరిధిలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. POCSO చట్టం కింద నమోదైన కేసుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. 2022- 426, 2023- 559, 2024- 713 కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదలపై పోలీసులు, సామాజిక సంస్థలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని, సమాజంలో జరుగుతున్న క్రైమ్ గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.
News February 23, 2025
HYD: మోదీ పక్కా బీసీ: MP ఆర్.కృష్ణయ్య

నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఎంపీ ఆర్.కృష్ణయ్య మోదీపై వస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టారు. మోదీ పక్కా బీసీ అని, ఆయన ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. బీజేపీ పూర్తిగా బీసీల పార్టీగా మారిందని, బీజేపీ బీసీని ప్రధానిని చేసిందని, మోదీ ఒక యోగి, సీఎం రేవంత్ మోదీ కులంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. మోదీ ప్రధాని అయ్యాక భారత కీర్తి ప్రతిష్ఠలు ఖండాంతరాలు దాటాయన్నారు.
News February 23, 2025
హైదరాబాద్: సీఎం విజన్‌కు అనుగుణంగా చర్యలు: HMR MD

హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత నాల్గో నగరంగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు అనుగుణంగా చర్యలు ప్రారంభించినట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్‌ను అధికారులు, సిబ్బందితో కలిసి ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలుష్య రహిత హరిత నగరంగా, ఫ్యూచర్ సిటీ మెట్రో రైల్ ప్రాజెక్టుకు HMR డీపీఆర్ సిద్ధం చేస్తోందని వెల్లడించారు.