News February 27, 2025
HYD: 2030 నాటికి 1.27 కోట్ల జనాభా..!

జీహెచ్ఎంసీ పరిధిలో జనాభా వేగంగా పెరుగుతోంది. వివిధ సర్వేల ప్రకారం, ప్రస్తుతం 1.08 కోట్లు ఉన్న జనాభా 2030 నాటికి 1.27 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ పెరుగుదల దృష్ట్యా రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ట్రాన్స్‌పోర్ట్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. HYD విస్తరణతో పాటు సమతుల్య ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడ్డారు.
Similar News
News December 6, 2025
విశాఖ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాముల కష్టాలు

విశాఖ విమానాశ్రయంలోనూ అయ్యప్ప స్వాములు అవస్థలు పడుతున్నారు. రెండు రోజులుగా చుక్కలు చూపిస్తున్న ఇండిగో సర్వీసులు శనివారం కూడా రుద్దయ్యాయి. శబరిమల వెళ్లేందుకు నగరం నుంచి చాలామంది ముందుగానే విమాన టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నారు. అయితే ఒక్కసారిగా అన్ని సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రయాణికులకు మెసేజ్‌లు పంపింది. దీంతో స్వాములు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.
News December 6, 2025
శబరిమలలో శ్రీకాకుళం జిల్లా వాసి మృతి

శబరిమలలో శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు పంచాయతీ కూటికుప్పలపేటకు చెందిన గురుగుబెల్లి వరాహ నరసింహులు (72) మృతి చెందారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లగా శుక్రవారం గుండెపోటుతో మృతిచెందినట్లు తోటి భక్తులు మృతుని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌లో స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువస్తున్నారు.
News December 6, 2025
హైదరాబాద్‌లో హారన్ మోతలకు చెక్.!

హైదరాబాద్‌లో రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోతోంది. దీనికితోడు హారన్‌ల మోత మోగుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు యోచిస్తున్నారు. ముంబై తరహాలో “హాంక్ మోర్ వెయిట్ మోర్” పద్ధతిని తీసుకురానున్నారు. దీంతో రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఎంత ఎక్కువగా హారన్ కొడితే అంత ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తుంది. దీని వల్ల ముంబైలో 60% సౌండ్ పొల్యూషన్ తగ్గింది. ఇదే తరహాలో ఇక్కడ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.


