News February 25, 2026

HYD: 21 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు

image

విధులకు హాజరుకాక, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నగరంలోని గాంధీ, పేట్లబుర్జూ, కోఠి ప్రసూతి ఆస్పత్రి వైద్యులతో సహా 21 మంది ఉన్నారు. ప్రభుత్వ దవాఖానాలకు ఎంపికైనా జాయిన్ అవ్వని, లాంగ్ లీవ్‌లో ఉన్న వారిని రాష్ట్ర వ్యాప్తంగా 94 మందిని తొలగించారు. వీరంతా అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి ఉద్యోగులే కావడం గమనార్హం.

Similar News

News April 14, 2026

యాదగిరిగుట్ట: ఈనెల 28 నుంచి స్వామివారి జయంతి ఉత్సవాలు

image

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 28 నుంచి 30 వరకు జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు. 28న లక్ష కుంకుమార్చన, 29న లక్ష పుష్పార్చన, 30న సహస్ర ఘటాభిషేకం, నృసింహ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ మూడు రోజుల పాటు జరిగే విశేష పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.

News April 14, 2026

పోలీసులు వీధి రౌడీల్లా ప్రవర్తించడమేంటి: జగన్

image

AP: SM కేసులలో పోలీసులు వీధి రౌడీల్లా అర్ధరాత్రి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడమేంటని YCP చీఫ్ జగన్‌ మండిపడ్డారు. ‘TDP నేతల మెప్పుకోసం కొందరు పోలీసులు రెచ్చిపోతున్నారు. వారిపై హైకోర్టులో కేసులు వేసి బాధితులకు న్యాయం చేస్తాం’ అని పేర్కొన్నారు. వేమూరు, రేపల్లె YCP నేతలు ఇవాళ జగన్‌ను కలిశారు. GOVT, TDP తీరుపై SMలో విమర్శించినందుకు పోలీసులు కొట్టారని పార్టీ నేతలు తనీష్, కృష్ణార్జునరెడ్డి తెలిపారు.

News April 14, 2026

కడప జిల్లాలో బెల్ట్ షాపులపై 47 కేసులు

image

కడప జిల్లా వ్యాప్తంగా మద్యం బెల్ట్ షాపులపై విస్తృతస్థాయిలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఒకేరోజు 47 కేసులు నమోదు చేశారు. 47 మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 579 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 554 క్వార్టర్ బాటిళ్ల మద్యం, 25 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశ్వనాథ్ హెచ్చరించారు.