News April 15, 2024
HYD: 21 రోజుల్లో నిర్మాణాలకు ఆమోదం
గ్రేటర్ HYD పరిధిలో నిర్మాణ అనుమతుల దరఖాస్తులు 21 రోజుల్లో ఆమోదం పొందాలని, లేనిపక్షంలో చర్యలుంటాయని GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా దరఖాస్తులను తొక్కిపెట్టే వారిని సహించేది లేదన్నారు. ప్రణాళిక విభాగం కార్యకలాపాల పై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతారని తెలిపారు.
Similar News
News January 9, 2025
HYD: ట్రై సైకిళ్లకు దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవాలి
ఛార్జింగ్ ట్రై సైకిల్‌లకు అర్హులైన దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవాలని వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగే తెలిపారు. సదరం సర్టీపికేట్ ఉండి, 80% శారీరక వైకల్యం, యూఐడి కార్డు, రేషన్ కార్డు, ఆధార్‌కార్డు ఉన్న దివ్యాంగులు అర్హులుగా తెలిపారు. 2పాస్ ఫోటోలు వికాలాంగులుగా గుర్తించే పూర్తి డాక్యుమెంట్స్ ఈ నెల 18లోపు 33 జిల్లాల అధ్యక్షులు 10మంది పేర్లు తయారు చేసి పంపించాలని కోరారు.
News January 9, 2025
గౌలిదొడ్డి గురుకులంలో 9వ తరగతికి ప్రవేశాలు
గచ్చిబౌలిలోని గౌలిదొడ్డి తెలంగాణ గురుకుల పాఠశాలలో 9వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, ఫిబ్రవరి 23వ తేదీ లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 9వ తరగతి ప్రవేశ పరీక్షకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు.
News January 9, 2025
HYD: జీడిపప్పుతో ఆరోగ్యానికి బోలెడు లాభాలు!
✓జీడిపప్పు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది✓చర్మ సంరక్షణకు దోహదపడుతుంది✓మెదడు పనితీరును సైతం మెరుగుపరుస్తుంది ✓కంటి చూపును సైతం మెరుగుపరిచే శక్తి ఉంది✓ఎముకలు బలంగా ఉండటానికి సహకరిస్తుంది✓రక్తంలోని చక్కర స్థాయిలను సైతం కంట్రోల్ చేస్తుంది. •జీడిపప్పు తినడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయని TGFPS-RR అనేక తెలిపారు.