News January 26, 2025
HYD: 23 మంది ప్రాణాలు కాపాడిన హోంగార్డ్‌కి మెడల్

HYD నగరం ఎల్బీనగర్ పరిధి సరూర్ నగర్ చెరువులో సూసైడ్ అటెంప్ట్ చేసిన 23 మంది ప్రాణాలను రాచకొండ కమిషనరేట్ హోంగార్డు మంత్రి ఈశ్వరయ్య కాపాడారు. వారందరికీ పునర్జన్మనిచ్చారు. ఆయన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి భవనంలో మెరిటోరియస్ సర్వీస్ మెడల్ (MSM) ప్రకటించింది. అడిషనల్ డీజీపీ IPS మహేష్ భగవత్ అతణ్ని సత్కరించారు.
Similar News
News November 8, 2025
MP సాన సతీశ్‌పై CM చంద్రబాబు ఆగ్రహం!

AP: గన్నవరం విమానాశ్రయంలో WC విన్నర్ శ్రీ చరణికి స్వాగతం పలికే విషయంలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. విమానాశ్రయానికి మంత్రులు, శాప్, ACA ప్రతినిధులు వెళ్లారు. శ్రీ చరణి ఉన్న లాంజ్‌లోకి BCCI మాజీ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్‌ని ప్రోటోకాల్ పోలీసులు వెళ్లనివ్వలేదు. దీనిపై MSKతో CM మాట్లాడారు. MP, ACA సెక్రటరీ సానా సతీశ్‌పై CM ఆగ్రహించినట్లు సమాచారం. ఇలాంటివి రిపీటవ్వకుండా చూసుకోవాలని ACAను ఆదేశించారు.
News November 8, 2025
నవంబర్ 8: చరిత్రలో ఈరోజు

1948: గాంధీని హత్య చేసినట్లు అంగీకరించిన గాడ్సే
2016: పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన కేంద్రం
1656: తోకచుక్కను కనుగొన్న సైంటిస్ట్ ఎడ్మండ్ హేలీ జననం
1927: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ జననం
1969: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జననం
1977: డైరెక్టర్ బీఎన్ రెడ్డి మరణం
2013: కమెడియన్ ఏవీఎస్ మరణం
News November 8, 2025
హోంగార్డుల సంక్షేమానికి కృషి: ఎస్పీ

హోంగార్డుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉంటామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డులు పి. జాన్, సీహెచ్ భవానీలకు ‘చేయూత’ కింద రూ.6.55 లక్షల చెక్కులను ఎస్పీ అందజేశారు.


