News October 24, 2024
HYD: 24 గంటలు నల్లా నీళ్లు బంద్

HYD వాసులకు ముఖ్య గమనిక. కృష్ణా తాగునీటి సరఫరా ఫేజ్-3లో మరమ్మతుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నారు. సరూర్‌నగర్, ఆటోనగర్, బోడుప్పల్, చెంగిచెర్ల, పెద్ద అంబర్‌పేట, లాలాపేట, షేక్‌పేట, మల్లికార్జుననగర్, శంషాబాద్, జూబ్లీహిల్స్, బండ్లగూడ, బోజగుట్ట, శాస్త్రిపురం, ఫిల్మ్‌నగర్, ప్రశాసన్‌నగర్‌లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు.
SHARE IT
Similar News
News November 28, 2025
గచ్చిబౌలిలో RS బ్రదర్స్ షోరూమ్ ప్రారంభం

RS బ్రదర్స్ 16వ షోరూమ్‌ను గచ్చిబౌలిలో మీనాక్షి చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. కుటుంబంలోని అన్ని తరాల వారి అవసరాలను ప్రతిబింబిస్తూ.. వివాహ వేడుకలకు అవసరమైన కొనుగోళ్లకు గమ్యంగా, సర్వాంగ సుందరంగా ముస్తాబైన షోరూం ప్రారంభోత్సవంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రారంభోత్సవంలో ఛైర్మన్ పొట్టి వెంకటేశ్వర్లు, ఎండీ రాజమౌళి, ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.
News November 28, 2025
RR: నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే కారణాలు

గ్రామపంచాయతీ ఎన్నిక నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే కారణాలు ఇవే..
– నామినేషన్ పత్రాలను నిర్దిష్ట సమయంలో దాఖలు చేయకపోవడం
– నిర్దేశించిన చోట అభ్యర్థులు, ప్రతిపాదించే వారు సంతకాలు చేయకపోవడం
– ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటే
– ఆస్తులు,అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని సరిగ్గా పొందుపర్చకపోవడం
– చట్ట ప్రకారం అవసరమైన డిపాజిట్ నగదును చెల్లించకపోవడం ప్రధాన అంశాలు.
News November 28, 2025
కాంగ్రెస్ తీరు.. రంగారెడ్డి జిల్లా ఫర్ సేల్: BRS

‘రంగారెడ్డి జిల్లా ఫర్ సేల్’ అన్నట్టుగా అధికార కాంగ్రెస్ వ్యవహరిస్తోందని రంగారెడ్డి జిల్లా BRS అధ్యక్షుడు, మాజీ MLA మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాలోని శివారు మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేసి ప్రజలపై భారీ పన్నుల భారాన్ని మోపే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆయన తుర్కయంజాల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లా అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామన్నారు.


