News September 16, 2025

HYD: 24 గంటలు గడిచినా కనిపించనిజాడ

image

భారీ వర్షానికి వరద పోటెత్తడంతో ఆదివారం రాత్రి నాలాలో గల్లంతైన మాన్గార్ బస్తీకి చెందిన అర్జున్, రామా జాడ ఇప్పటివరకు లభించలేదు. ఆదివారం రాత్రి నుంచి DRF, GHMC రెస్క్యూ టీమ్‌లు తీవ్రంగా గాలిస్తున్నాయి. మూసీ నదిలోనూ ముమ్మరంగా గాలింపు ప్రక్రియ కొనసాగుతోంది. వారిద్దరు నాలాలో కొట్టుకొని పోవడంతో అఫ్జల్ సాగర్‌ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News September 16, 2025

ఓయూ: 22 నుంచి నూతన కోర్సు ప్రారంభం

image

ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలోని ది సెంటర్‌ ఫర్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ట్రెయినింగ్‌(సెల్ట్‌)లో ‘ఇంగ్లిష్‌ కమ్యునికేషన్‌ స్కిల్స్‌& పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌’ కోర్సు ప్రారంభిస్తున్నారు. తరగతులు సా.6 నుంచి 7:30 గంటల వరకు ఉంటాయి. ఆసక్తిగల వారు ఈ నెల 20లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సెల్డ్‌ డైరెక్టర్‌ ప్రొ.సవీన్‌ సౌద తెలిపారు. 7989903001 నంబరుకు ఫోన్‌ చేయొవచ్చు.
# SHARE IT

News September 16, 2025

HYD: నేటి నుంచి TGలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత

image

నేటి నుంచి TGలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయ్యనున్నారు. రూ.1,400 కోట్ల బకాయిలు ఉన్నట్లు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. గత 20 రోజులుగా ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం ఆయాయి. దీంతో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 330 ఆస్పత్రులకు గత 12 నెలలుగా బకాయిలు పెండింగ్‌ ఉండడంతో వెంటనే చెల్లించాలని సేవలు నిలిపివేయన్నున్నారు.

News September 16, 2025

HYDలో రహదారులు గోదారులవుతోంది ఇందుకే!

image

HYDలో రహదారులు గోదారులు కావడానికి జనాభాకు అవసరమైన స్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, చెరువులు, నాలాలు కబ్జా కావడం ప్రధాన కారణాలు. వీటన్నింటితో పాటు అందుబాటులో ఉన్న వనరుల్ని వినియోగించకపోవడంతో వరద ముంపునకు కారణమవుతున్నట్లు హైడ్రా గుర్తించింది. ఇటీవల మైత్రివనం చౌరస్తా వద్ద చేపట్టిన వరద తరలింపు చర్యలు ఫలితాలు ఇవ్వడంతో నగరంలో మరో 40 ప్రాంతాల్లో అమలు చేస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు.