News September 22, 2025

HYD: 24 నుంచి దుర్గామాత మండపాలకు ఫ్రీ కరెంట్

image

సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దుర్గామాత మండపాలకు ఉచిత కరెంటు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రేటర్ పరిధిలో అమ్మవారి మండపాలు ఏర్పాటు చేసేవారు స్థానిక PSలో సమాచారం అందజేసి, అనంతరం ఎలక్ట్రిసిటీ అధికారులకు సమాచారం ఇస్తే ఉచిత కరెంట్ అందేలా చర్యలు తీసుకుంటారని TGSPDCL AE నిఖిల్ తెలిపారు.

Similar News

News September 22, 2025

HYD: అగ్రసేన్ మహారాజ్ విగ్రహానికి సీఎం నివాళి

image

శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఆ మహనీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. సీఎం వెంట స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారు.

News September 22, 2025

గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ స్పందన

image

గాజులరామారంలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అక్కడ నకిలీ పట్టాలతో భూములు కబ్జా చేశారని వెల్లడించారు. నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేసి భూములను అమ్మారన్నారు. ఆ భూముల విలువ రూ.15వేల కోట్లు ఉంటుందని, కబ్జా చేసిన వారిలో రౌడీషీటర్లు ఉన్నారని రంగనాథ్‌ తెలిపారు. కబ్జా చేసిన వాటిలో 30శాతమే కూల్చేశామని, కూల్చినవి కూడా నిర్మాణంలో ఉన్నవేనన్నారు. సోషల్‌మీడియాలో దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్నారు.

News September 22, 2025

HYD: ‘CMRF’ చెక్కుల కేసులో మరో ఇద్దరి అరెస్ట్

image

HYD జూబ్లీహిల్స్ PS పరిధిలో ఇద్దరు వ్యక్తులు ఏకంగా CMRF చెక్కులను లబ్ధిదారులుగా చూపించి కొట్టేయాలని చూశారు. కానీ.. వారి గుట్టును HYD పోలీసులు బయటపెట్టారు. ఫేక్ లబ్ధిదారులుగా సృష్టించారని, ఆ తర్వాత రూ.8.17 లక్షలు తమ అకౌంట్లోకి పంపించుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులు పగడాల శ్రీనివాసరావు(23), యాస వెంకటేశ్వర్లు (50)గా గుర్తించి అరెస్టు చేసినట్లు ప్రకటించారు.