News August 23, 2025
HYD: 24/7 హైడ్రా చర్యలు.. స్పెషల్ REPORT

వర్షాకాలం ముందు నుంచే HYDలో పూడిక తొలగింపు పనులు జరగగా జులై 1 నుంచి పనుల్లో హైడ్రా వేగం పెంచింది. ఇప్పటి వరకు 15,665 క్యాచ్‌పిట్లు, 359 కల్వర్టులను సిబ్బంది శుభ్రపరిచారు. 1,670 నాలాల్లో చెత్తను తొలగించారు. 4,609 వాటర్ లాగింగ్ పాయింట్లు క్లియర్ చేసి, వర్షాకాలంలో 4,974 ప్రాంతాల్లో చెత్తను తొలగించారు. మొత్తంగా జులై 1 నుంచి ఆగస్టు 21 వరకు 27,272 చోట్ల చెత్త, పూడిక తొలగింపు పనులు పూర్తి చేశారు.
Similar News
News August 23, 2025
చోడవరం: బైక్‌ను ఢీకొట్టిన బొలెరో.. వ్యక్తి మృతి

చోడవరం మండలం వెంకన్నపాలెం శివారు ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరొకరు గాయపడ్డారు. అనకాపల్లి వెళుతున్న బొలెరో వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చోడవరం మండలం ఎం.కొత్తపల్లికి చెందిన వి.రాము నాయుడు మృతి చెందగా, ఇదే వాహనంపై ఉన్న ఎన్.సోమ నాయుడి రెండు కాళ్లు విరిగిపోయాయని ఎస్ఐ జోగారావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News August 23, 2025
రేపటి నుంచి ఆల్ ఇండియా స్పీకర్ల కాన్ఫరెన్స్

ఢిల్లీ అసెంబ్లీ భవనంలో ఆది, సోమవారాల్లో ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ 2 రోజుల సదస్సును హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. సోమవారం ముగింపు కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో తెలుగు రాష్ట్రాల సభాపతులతో పాటు మరో 30 మంది స్పీకర్లు పాల్గొననున్నారు.
News August 23, 2025
స్థానిక సంస్థల ఎన్నికల కోసం కమిటీ

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్, భట్టి, పొన్నం, సీతక్క సభ్యులుగా ఉన్నారు. ఈ నెల 28వ తేదీ లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు, ఈ నెల 29న క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని PAC భేటీలో నిర్ణయించారు.