News October 6, 2024
HYD: 2,525 చెరువులకు హద్దులు ఖరారు
HYD మహా నగరంలో చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని పర్యావరణవేత్తలు FTL, బఫర్ జోన్లను నిర్ధారించాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హెచ్ఎండీఏలోని 3,532 చెరువుల్లో 230కి మాత్రమే బఫర్ జోన్ నిర్ధారించారు. 2,525 చెరువులకు హద్దులు ఖరారు చేశారు. కాగా మరో 1,000 చెరువులకు 3 నెలల్లో హద్దులను నిర్ధారించాల్సి ఉంది.
Similar News
News November 1, 2024
HYD: కల్తీ పాలను ఇలా గుర్తించండి..!
HYD నగరంలో కల్తీ మహమ్మారి ప్రజలను భయపెడుతోంది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ కమిషన్, FSSAI అధికారులు కల్తీ పాలను గుర్తించే విధానాన్ని వివరించారు.చల్లార్చిన పాలలో 2-3 చుక్కల అయోడిన్ టింక్చర్ కలపాలి. కాసేపటి తర్వాత పాలు నీలిరంగు కలర్‌లో మారితే కల్తీ జరిగినట్లని గుర్తించాలి. పన్నీర్ లాంటి ఇతర పాల ఉత్పత్తుల టెస్టింగ్లో 2-3ML శాంపిల్లో 5ML నీటిని కలిపి కాచి చల్లార్చి, 2-3 చుక్కల అయోడిన్ టింక్చర్ కలపాలన్నారు.
News November 1, 2024
సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్లు
సికింద్రాబాద్, HYD, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి దీపావళి పండుగ వేళ నేడు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో నేడు ఏకంగా 29 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. HYD-గోరఖ్ పూర్, HYD-జైపూర్,సికింద్రాబాద్-బెర్హంపూర్,కాచిగూడ-నాగర్ కోయిల్, సికింద్రాబాద్-పాట్నాకు ప్రత్యేక రైళ్లు ఉన్నాయని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News November 1, 2024
గండిపేటకు గోదావరి జలాలు
గండిపేట చెరువుకు గోదావరి నీళ్లు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల్లో టెండర్లను పిలవనుంది. తొలి దశలో గండిపేట నుంచి బాపూఘాట్ వరకు పనులు కానుండగా.. బాపూఘాట్‌ని సుందరీకరించనుంది. మూసీ పునరుజ్జీవంలో బాపూఘాట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. బాపూఘాట్ దగ్గర వీటి శుద్ధి ఎస్టీపీలకు రూ.7 వేల కోట్లతో టెండర్లు 3 పిలవనుంది. ఈ మేరకు అధికారులతో సీఎం సమీక్షించారు.