News November 28, 2024
HYD: 26 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: ఆర్.కృష్ణయ్య
వచ్చే డీఎస్సీలో 26 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన నిరుద్యోగుల సభలో మాట్లాడుతూ.. విద్యాశాఖ అధికారులు టీచర్ పోస్టుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. ఏ పాఠశాలకు వెళ్లినా టీచర్ల కొరత ఉందన్నారు. ఎయిడెడ్ పాఠశాలలో 6 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నా వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వటం లేదన్నారు.
Similar News
News December 4, 2024
HYD: రేపు డెక్కన్ ఎరీనాలో హోరాహోరీ మ్యాచ్
అజీజ్‌నగర్‌లో ఐ – లీగ్ (ఫుట్ బాల్) పోటీలు జరగనున్నాయి. డెక్కన్ ఎరీనాలో రేపు (గురువారం) రాజస్థాన్ యునైటెడ్ ఎఫ్‌సీతో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ తలపడనుంది. హైదరాబాద్ తరఫున శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ తలపడనున్న నేపథ్యంలో మ్యాచ్‌కి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
News December 4, 2024
అమీర్‌పేట: ఆధార్ సేవల కోసం తప్పని తిప్పలు..!
TG, AP, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆధార్ సేవల కోసం అమీర్‌పేట స్వర్ణ భారతి కాంప్లెక్స్ ఆధార్ రీజినల్ సెంటర్ వద్దకు వచ్చిన వారికి తిప్పలు తప్పడం లేదు. ప్రతిరోజు కేవలం 150 టోకెన్లు మాత్రమే ఇస్తుండడంతో, ఉదయం 6 గంటలకు వచ్చి క్యూ కడుతున్నారు. అసలే చలికాలం కావడంతో ఇబ్బందులు మరింత పెరిగాయి. మంగళవారం ఓ వ్యక్తికి మూర్చ రాగా.. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.
News December 4, 2024
పలు మెట్రో రైళ్లు మెట్టుగూడ వరకే..!
HYDలో మెట్రో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో మెట్రో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు డైరెక్ట్ మెట్రో సేవలకు బదులుగా, రాయదుర్గం నుంచి మెట్టుగూడ వరకు పలు రైళ్లను నడుపుతోంది. మెట్టుగూడ నుంచి తిరిగి రిటర్న్ రాయదుర్గం వెళ్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.