News September 22, 2025

HYD: 26 లక్షల మంది ప్రయాణికులు.. బస్సులు 3,200..!

image

HYD నుంచి వివిధ జిల్లాలు, పట్టణాలకు ఆర్టీసీ కేవలం 3,200 బస్సులు మాత్రమే నడిపిస్తుండడంతో ఇబ్బందులు కలుగుతున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. 26 లక్షల మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా సరిపడా బస్సులు లేకపోవడంతో కిక్కిరిసి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు రెండు రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

Similar News

News September 22, 2025

SRPT: బడికి సెలవు.. నాకు కాదు

image

దసరా సెలవులంటే సరదాగా ఆటపాటలతో గడపాల్సిన వయసులో ఓ బాలిక తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. చివ్వెంల మండలం బండమీది చందుపట్లలో జాతీయ రహదారి 365(BB)పై ఈ దృశ్యం కనిపించింది. చందుపట్లలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ధరావత్ గ్రీష్మ తన తండ్రి వరి పొలానికి మందు కొడుతుండగా, తాను గొర్రెలను మేపుతూ బడిలో ఇచ్చిన హోంవర్క్‌ను రాసుకుంటూ కనిపించింది.

News September 22, 2025

బొంరాస్ పేట్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

బొంరాస్ పేట్ మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య (50) బైక్ పై కొడంగల్ నుంచి సొంత గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో నాగిరెడ్డిపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టడంతో ప్రమాదానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News September 22, 2025

గద్వాల: ప్రజావాణిలో 41 ఫిర్యాదులు.. పరిష్కరించండి: కలెక్టర్

image

గద్వాల జిల్లాలో ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యమిచ్చి, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 41 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఆయన సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.