News January 2, 2025

HYD: 27 మున్సిపాలిటీలపై హైడ్రాకు అధికారం

image

HYD నగరం నుంచి ORR వరకు ఉన్న 27 మున్సిపాలిటీలపై హైడ్రాకు అధికారం ఉందని కమిషనర్ రంగనాథ్ అన్నారు. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 పురపాలక సంఘాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, శాటిలైట్ చిత్రాల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. చెరువుల్లో భవన నిర్మాణ వ్యర్థాల డంపింగ్‌పై కూడా దృష్టి పెట్టామన్నారు. హైడ్రా వచ్చినప్పటి నుంచి ప్రజలకు FTL, బఫర్ జోన్‌పై అవగాహన పెరిగిందన్నారు.

Similar News

News January 8, 2025

HYDలో ఒకేసారి పూసిన 92 పువ్వులు

image

అరుదుగా కనిపించే బ్రహ్మ కమలాలు ఒకేసారి 92 వికసించాయి. మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడలోని ధనలక్ష్మి రమణమూర్తి ఇంట్లో చెట్టుకు ఈ అద్భుతం జరిగింది. ఒకే రోజు పదుల సంఖ్యలో పూలు పూయడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఏడాదికి ఒకేసారి పూసే బ్రహ్మకమలాలు విరివిగా పూయడం విశేషం.

News January 8, 2025

చర్లపల్లి టెర్మినల్ ఓపెన్.. మరి రోడ్లు?

image

చర్లపల్లి టెర్మినల్ అత్యాధునిక హంగులతో‌ ప్రారంభమైంది. స్టేషన్‌కు వెళ్లే రోడ్లను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికుల అభిప్రాయం. సిటీ నుంచి వచ్చే వారు హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ మీదుగా స్టేషన్‌కు చేరుకోవచ్చు. కీసర, మేడ్చల్, ECIL వాసులు రాంపల్లి మీదుగా వస్తారు. ప్రస్తుతం ఈ రహదారులు బాగానే ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ పెరిగితే రోడ్లను విస్తరించాల్సిందేనా..? దీనిపై మీ కామెంట్?

News January 7, 2025

ఎస్సీ వర్గీకరణ అమలుకు కృషి చేస్తా: AICC సెక్రెటరీ

image

AICC సెక్రెటరీ సంపత్ కుమార్‌ను మంద కృష్ణ మాదిగ కలిశారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయించాలని సంపత్‌ని కోరారు. చేవెళ్ల డిక్లేరేషన్, అసెంబ్లీలో CM రేవంత్ చేసిన ప్రకటనకు అనుగుణంగా వర్గీకరణను త్వరగా అమల్లోకి తీసుకొచ్చేలా కృషి చేయాలన్నారు. వేల గొంతులు-లక్షల డప్పుల కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. వర్గీకరణ పూర్తవడానికి తన వంతు కృషి చేస్తానని సంపత్ హామీ ఇచ్చారని కృష్ణ తెలిపారు.