News October 31, 2025

HYD: ‘3 నెలల క్రితమే మంత్రి పదవిపై నిర్ణయం’

image

కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు. అజార్‌పై ఉన్న కేసుల గురించి స్పష్టంగా చెప్పాలంటే కిషన్‌రెడ్డి ముందుకు రావాలని సవాల్ విసిరారు. 3 నెలల క్రితమే ఆయనకు మంత్రి పదవిపై నిర్ణయం తీసుకున్నామని, దీంతో మైనారిటీలకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.

Similar News

News October 31, 2025

బ్యాంకులకు కొత్త డొమైన్.. నేటితో ముగిసిన గడువు

image

సైబర్ నేరాలను తగ్గించడమే లక్ష్యంగా బ్యాంకులు తమ వెబ్‌సైట్లను .bank.in డొమైన్‌కు మార్చుతున్నాయి. ఇందుకు RBI విధించిన గడువు నేటితో ముగిసింది. ఇప్పటి వరకు SBI, PNB, CANARA వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు HDFC, ICICI, AXIS, కోటక్ మహీంద్రా వంటి ప్రైవేటు బ్యాంకులూ కొత్త డొమైన్‌కు మారాయి. మరికొన్ని బ్యాంకులు .comతో కొనసాగుతూ ఏదైనా కేటగిరీ ఎంచుకున్నప్పుడు .bank.inకు రీడైరెక్ట్ చేస్తున్నాయి.

News October 31, 2025

ఏలూరు: 100 రోజుల కార్యాచరణపై డీఈవోతో చర్చ

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ ఏలూరులో తన క్యాంపు కార్యాలయంలో డీఈవో నారాయణతో శుక్రవారం సమావేశమయ్యారు. పదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. గత ఏడాది కంటే ఉత్తీర్ణత స్థాయి గణనీయంగా పెంచే విధంగా కృషి చేయాలని ఆమె సూచించారు. ‘విజయ్ కేతనం’ పుస్తకాలను మరింత ముందుగానే పంపిణీ చేస్తామని డీఈవో అన్నారు.

News October 31, 2025

రాజమండ్రి: నవంబర్ 1 నుంచి స్వాభిమాన్ ఉత్సవాలు

image

బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు గిరిజన స్వాభిమాన్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్టీ సంక్షేమ, సాధికారిత అధికారి కె.ఎన్. జ్యోతి తెలిపారు. గిరిజన సమాజ చరిత్ర, వారసత్వం, సాంస్కృతిక విలువలు ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు. నవంబర్ 1న బిర్సా ముండా జ్ఞాపకార్థం మొక్కల పెంపకం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.