News July 23, 2024
HYD: 3 రోజులు స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల పిల్లలకు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకకుండా 3 రోజులు పాఠశాలలకు సెలవు ఇవ్వాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(AISF) హయత్‌నగర్ మండల కార్యదర్శి అరుణ్ కుమార్ గౌడ్, గ్రేటర్ HYD నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వారు మాట్లాడారు. ఆన్‌లైన్ ద్వారా క్లాసులు నిర్వహించాలని కోరారు. నాయకులు ఎన్నపల్లి ఉపేందర్, జిన్నా, బన్నీ, జూనోతల భాను ప్రకాశ్ ఉన్నారు.
Similar News
News November 9, 2025
HYD: సైకో పోవాలి.. సారే రావాలి: రైతు సురేశ్

జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్‌లో KTR రోడ్ షో నిర్వహించారు. బైపోల్ సందర్భంగా నగరంలో రకరకాల ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిన్న BRS రోడ్ షోలో వనస్థలిపురం వారిది ‘రప్ప రప్ప’ పోస్టర్ కనిపించగా, ఇవాళ ‘సైకో పోవాలి..సారే రావాలి’ అనే క్యారీక్రేచర్ పోస్టర్‌ను రైతు సురేశ్ ప్రచారం రథం వద్ద ప్రదర్శించారు. ఏదేమైనా ఇరుపార్టీల బ్యానర్‌ల పంచాయితీ తారస్థాయికి చేరింది.
News November 9, 2025
HYD: అవినీతి పాలనకు ముగింపు పలకాలి: BJP

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వెంగళ్‌రావునగర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా BRS పాలనలో.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ HYD అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని, ప్రజలు ఈసారి అవినీతి, మోసపూరిత పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.
News November 9, 2025
రాయదుర్గం PSలో మాగంటి గోపీనాథ్ తల్లి ఫిర్యాదు

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని గోపీనాథ్ మృతి ఆయన తల్లి రాయదుర్గం PSలో ఫిర్యాదు చేశారు. మాగంటి మహనంద కుమారి కుమారుడు మరణంపై పోలీసులు దర్యాప్తు చెయ్యాలని సూచించారు. మృతికి సంబంధించి మొదటి నుంచి తల్లి మహానందకుమారి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి తెలిసిందే.


