News November 25, 2024
HYD: 3.5 లక్షల కుటుంబాలు ఉచిత తాగునీటికి దూరం
GHMC పరిధిలో మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఉచిత తాగునీరు పథకం ఇంకా అర్హులకు పూర్తిగా అందడం లేదు. అర్హులైన ప్రతి కుటుంబానికి నెలకు 20వేల లీటర్ల తాగునీటిని జలమండలి సరఫరా చేస్తోంది. నగరంలో 9,73,873 అర్హులైన కుటుంబాలు ఉండగా ఇప్పటివరకు 6,14,497 కుటుంబాలు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నాయి. ఇంకా 3,59,376 కుటుంబాలకు ఉచిత తాగునీరు అందటం లేదు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
Similar News
News December 12, 2024
HYDలో 84,000 ఇందిరమ్మ ఇళ్లు!
HYDలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్‌న్యూస్. లబ్ధిదారుల వివరాలు పరిశీలించేందుకు ప్రభుత్వం సర్వేయర్లను నియమించింది. HYDలో 5,00,822, మేడ్చల్‌లో 3,22,064, రంగారెడ్డిలో 1,96,940, పటాన్‌చెరు నియోజవకర్గంలో 20,711, కంటోన్మెంట్‌లో 29,909 దరఖాస్తులు వచ్చాయి. తొలి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రేటర్‌లో 84,000 ఇళ్లు నిర్మించాలి.
News December 12, 2024
HYD: కుమ్మరిగూడలో కొలువుదీరిన ముత్యాలమ్మ
సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ఠ బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు. గుడిపై దాడి అనంతరం సికింద్రాబాద్‌లో తీవ్ర ఘర్షణ నెలకొంది. ప్రభుత్వం, ప్రతిపక్షాలు సైతం నివ్వెరపోయాయి. దాడిని తీవ్రంగా ఖండించాయి. యుద్ధప్రాతిపదికన నిధులు విడుదల చేసిన సర్కార్ అమ్మవారిని కొలువుదీర్చారు. భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News December 11, 2024
జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ గ్రౌండ్‌లో గ్రాండ్‌గా క్రిస్మస్ వేడుకలు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలోని SPR హిల్స్‌లో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఆద్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. మంత్రి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంత పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన సీఎన్ రెడ్డిని మంత్రి అభినందించారు.