News August 4, 2024
HYD: 309 మంది మందు బాబులు పట్టుబడ్డారు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో తాగి వాహనాలు నడిపి 309 మంది బాబులు పోలీసులకు పట్టుబడ్డారు. కమిషనరేట్ పరిధిలో శుక్రవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 309 మందిలో అత్యధికంగా 211 మంది ద్విచక్ర వాహనదారులు కాగా.. 11 మంది ఆటో డ్రైవర్లు, 36 మంది కారు, ఒకరు భారీ వాహన డ్రైవర్లు ఉన్నారు.
Similar News
News September 19, 2024
HYD: హృదయవిదారకం.. ప్రాణం తీసిన ఆకలి!
హైదరాబాద్ శివారులో బుధవారం హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి తొండుపల్ల మసీదు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. యాచకుడిగా గుర్తించి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆకలితో అలమటిస్తూ ఆ వృద్ధుడు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇది విన్న స్థానికులు చలించిపోయారు.
News September 18, 2024
HYD: RTC బస్సు ఢీకొని ఒకరి మృతి
RTC బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శంకర్‌పల్లి PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మున్సిపల్ పరిధి బుల్కాపూర్ వార్డు శివారులో గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. HYD నుంచి శంకర్‌పల్లి వైపు వస్తున్న RTC బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2024
HYD: లడ్డూ వేలం.. ఏ ప్రాంతంలో ఎంతంటే..?
✓బండ్లగూడ జాగీర్ రిచ్మండ్ విల్లాస్‌లో రూ.1.87 కోట్లు
✓బాలాపూర్ గణపతి రూ.30,01,000
✓కొంపల్లి అపర్ణ మెడోస్ రూ.29.10 లక్షలు
✓శంకర్పల్లి విఠలేశ్వరుడి వద్ద రూ.12.51 లక్షలు
✓అత్తాపూర్ భక్త సమాజ్ రూ.11.16 లక్షలు
✓ఉప్పరపల్లి వీరాంజనేయాలయంలో రూ.10 లక్షలు
✓చేవెళ్ల ఖానాపూర్‌లో రూ.6.63 లక్షలు
✓బాచుపల్లి బడా గణేశ్ రూ.6.2 లక్షలు
✓శంకర్పల్లి పర్వేదలో రూ.4 లక్షలు
మీ ప్రాంతంలో ఎంతో కామెంట్ చేయండి