News October 26, 2024
HYD: 4 గ్రేటర్ కార్పొరేషన్లపై మీ అభిప్రాయం ఏంటి?

ORR అంతర్భాగంలోని GHMCతో పాటు శివారు ప్రాంతాల్లోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలను కలిపి కొత్తగా 4 గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి పురపాలక, ప్లానింగ్ శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తుంది. ORR లోపల దాదాపు 2 కోట్ల జనాభా నివసిస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. మరి 4 కార్పొరేషన్ల ఏర్పాటుపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.
Similar News
News November 11, 2025
HYD: సీఎం ప్రజావాణిని సందర్శించిన అధికారులు

సీఎం ప్రజావాణిని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా సీఎం ప్రజావాణి పనితీరును వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో సమస్యల పరిష్కారంలో అమలు చేస్తున్న తీరును స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని పాల్గొన్న అధికారులు తెలిపారు. సమస్యల పరిష్కారంలో అనుసరిస్తున్న వైఖరిని అధికారులు ప్రజావాణి ఇన్ఛార్జ్ చిన్నారెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
News November 11, 2025
జూబ్లీ బైపోల్: 5PM UPDATE.. 47.16% పోలింగ్ నమోదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ మరికాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు. 47.16% పోలింగ్ నమోదు అయినట్లు స్పష్టం చేశారు. ఆయా పోలింగ్ బూత్‌లలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు. మరో అరగంట పోలింగ్‌కు అవకాశం ఉండడంతో పర్సంటేజ్ ఇంకా పెరగనుంది.
News November 11, 2025
జూబ్లీ బైపోల్: మోడల్ స్టేషన్లో మహిళా ఓటర్ల క్యూ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మొత్తం 5 మోడల్ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటైన షేక్‌పేటలోని సక్కు బాయి మెమోరియల్ హైస్కూల్ మోడల్ పోలింగ్ స్టేషన్ నం.19లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు ఓటు వేయడానికి వరుసలో నిల్చున్నారని, ఇది ప్రజాస్వామ్యం ఫరిడవిల్లునట్లే అని CEO_Telangana ట్వీట్ చేసింది.


