News July 4, 2024
HYD: 40 మంది ఇన్స్పెక్టర్లకు స్థానచలనం

HYD నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న 40 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 14 మంది ఇన్స్పెక్టర్లను మల్టీ జోన్లకు అటాచ్ చేస్తూ ఆదేశించారు.
Similar News
News October 16, 2025
HYD: అయ్యో.. ఆమె బయటపడుతుందా?

HYD మహిళకు 25ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ దుబాయ్ కోర్టు తీర్పునిచ్చింది. బహదూర్పురకు చెందిన మహిళ బ్యూటీషన్ పనికోసం దుబాయ్ వెళ్లడానికి ఓ ఏజెంట్ ద్వారా వీసా ప్రాసెసింగ్ చేసుకుంది. అతడు ఆమెకు ఓ పార్సిల్ ఇచ్చాడని, ఎయిర్పోర్ట్లో దిగాక అందులో గంజాయి ఉందని కుటుంబీకులు ఆరోపించారు. ఆమెకు 5ఏళ్ల కొడుకు ఉన్నాడు. కుటుంబపోషణకు వెళ్తే.. జైలుశిక్ష పడిందని ఆమెను కాపాడాలని కేంద్రాన్ని కోరగా ప్రభుత్వం స్పందించింది.
News October 16, 2025
HYD: భారీగా వస్తాయనుకుంటే.. బోర్లా పడేశాయి!

భారీగా వస్తాయనుకున్న మద్యం షాపుల దరఖాస్తులు ఆబ్కారీశాఖలో ఆందోళన రేపాయి. గతేడాది ఉమ్మడి రంగారెడ్డిలో 514 మద్యం షాపులకు 38,493 దరఖాస్తులు రాగా.. 3రోజుల మిగిలి ఉండగా ఇప్పుడు కేవలం 3,173 వచ్చాయి. దీనికి వివిధ కారణాలు లేకపోలేదు. ఫీజు రూ.3లక్షలు చేయడం, రియల్ ఎస్టేట్ డమాల్ అనడం, స్థానిక ఎన్నికల ఆశావహులు ఖర్చు చేయకపోతుండటంతో దీనిపై ప్రభావం పడింది. గతేడాది దరఖాస్తుల ద్వారా రూ.769.86 కోట్ల ఆధాయం వచ్చింది.
News October 16, 2025
HYD: చేతుల మీదే భారం.. సిటీలో ప్రయాణం!

సిటీ శివారులోని స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులను ఆర్టీసీ బస్సుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పీక్స్ అవర్లో సర్కస్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి ఉంది. దిల్సుఖ్నగర్ నుంచి ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం నుంచి ఎల్బీనగర్, ఉప్పల్ రూట్లో ఉదయం, సాయంత్రం కూర్చోడానికి కనీసం సీటు దొరకనంత రద్దీ ఉంటోంది. విద్యార్థులు ఫుట్ బోర్డ్పై వేలాడుతూ ఇలా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు.