News September 19, 2025

HYD: 40 ప్రాంతాల్లో వరదలకు కారణం ఇదే..!

image

గ్రేటర్ వ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థ జనాభాకు అవసరమైన స్థాయిలో లేకపోవడం, మరోవైపు సిల్ట్ భారీ మొత్తంలో పేరుక పోవడంతో అనేక చోట్ల నాలాలు పూడుకపోయాయి. ఇలాంటి పరిస్థితి దాదాపు 40 చోట్ల ఉన్నట్లు గుర్తించిన హైడ్రా ఎక్కడికక్కడ సిల్ట్ క్లియర్ చేయడంపై ఫోకస్ పెట్టినట్లు వివరించింది. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో పనులు పూర్తి చేస్తామని పేర్కొంది.

Similar News

News September 19, 2025

కవితపై దాడి చేయాలని చూస్తున్నారు: రేవంత్

image

TG: CM రేవంత్ మీడియాతో చిట్‌చాట్‌లో పలు అంశాలపై మాట్లాడారు. ‘నేను కవితకు సపోర్ట్ చేయడం లేదు. ఆమె కాంగ్రెస్‌లోకి వస్తానంటే ఒప్పుకోను. KCR, KTR, హరీశ్‌రావు కలిసి ఆడపిల్లపై దాడి చేయాలని చూస్తున్నారు. ఇది వారి ఇంటి సమస్య. వారిని ప్రజలు బహిష్కరించారు. కాళేశ్వరం విచారణ బాధ్యతను CBIకి అప్పగించి చాలా రోజులైనా కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు? KTR ఏం చెప్తే కిషన్‌రెడ్డి అది చేస్తారు’ అని వ్యాఖ్యానించారు.

News September 19, 2025

అంకిత భావ సేవలతో పని చేయాలి: కలెక్టర్

image

రెవెన్యూ అధికారులు నిబద్ధత అంకిత భావ సేవలతో పని చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అమలాపురం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో రెవెన్యూ అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. జీవో నంబర్ 55 ప్రకారం దసరా సందర్భంగా మండపాలు రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News September 19, 2025

తొలి లేడీ లోకో పైలెట్‌కు ఘన సత్కారం

image

ఆసియాలోనే తొలిమహిళా లోకో పైలెట్ అయిన సురేఖయాదవ్ ఈ నెలాఖరున రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను డిపార్ట్‌‌మెంట్ సిబ్బంది, కుటుంబసభ్యులు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో ఘనంగా సత్కరించారు. 1988లో ఉద్యోగంలో చేరిన సురేఖ గూడ్స్ రైళ్ల నుంచి ముంబైలోని ఐకానిక్ లోకల్ రైళ్లు, ప్రతిష్ఠాత్మక దక్కన్ క్వీన్ నుంచి ఆధునిక వందే భారత్ వరకు అన్ని రైళ్లను నడిపిన మొదటి మహళా లోకోపైలెట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.