News September 19, 2025

HYD: 40 ప్రాంతాల్లో వరదలకు కారణం ఇదే..!

image

గ్రేటర్ వ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థ జనాభాకు అవసరమైన స్థాయిలో లేకపోవడం, మరోవైపు సిల్ట్ భారీ మొత్తంలో పేరుక పోవడంతో అనేక చోట్ల నాలాలు పూడుకపోయాయి. ఇలాంటి పరిస్థితి దాదాపు 40 చోట్ల ఉన్నట్లు గుర్తించిన హైడ్రా ఎక్కడికక్కడ సిల్ట్ క్లియర్ చేయడంపై ఫోకస్ పెట్టినట్లు వివరించింది. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో పనులు పూర్తి చేస్తామని పేర్కొంది.

Similar News

News September 19, 2025

HYD: బతుకమ్మ వేడుక.. బస్సులు సిద్ధం ఇక..!

image

బతుకమ్మ వేడుకలు.. దసరా సెలవులు త్వరలో రానుండటంతో సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. MGBS, ఆరాంఘర్, జేబీఎస్, KPHB కాలనీ, ఎల్‌బీనగర్, ఉప్పల్ క్రాస్ రోడ్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. ప్రయాణికులు వివరాల కోసం 040-69440000, 040-23450033 నంబర్లకు ఫోన్ చేయొచ్చు. SHARE IT

News September 19, 2025

గ్రేటర్ HYD అధికారులకు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

image

భారీ వర్షాల నేపథ్యంలో HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తుండటతో వరద నీరు సిటీ రోడ్లను ముంచెత్తుతోందని, ఎక్కడెక్కడ మ్యాన్ హోళ్లకు మూతలు లేవో అర్థం కావడం లేదన్నారు. మ్యాన్ హోల్స్ వద్ద తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు.

News September 19, 2025

దమ్ముంటే జూబ్లీహిల్స్‌లో గెలిచి చూపించు KTR: మంత్రి

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓ వైపు అధికార పార్టీ, మరో వైపు ప్రతిపక్ష పార్టీ నువ్వానేనా అన్నచందంగా మాటల తూటాలు పేలుస్తున్నాయి. తాజాగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. ‘KTR నువ్వో పిల్లబచ్చా..అసెంబ్లీ ఎన్నికల్లో కాదు దమ్ముంటే జూబ్లీహిల్స్‌లో గెలిచి చూపించు..అప్పటికి నువ్వు ఇండియాలో ఉంటవో విదేశాలకు చెక్కేస్తవో’అని అన్నారు. నోటిదూల KTRకు మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని Tకాంగ్రెస్ Xలో ట్వీట్ చేసింది.