News April 18, 2024

HYD: 40 శాతం మందికే వాటర్‌ మీటర్లు!

image

HYD నగరంలో HMWSSB పరిధిలో దాదాపు 13.5 లక్షల మంది వినియోగదారులు ఉండగా కేవలం సుమారు 5 లక్షల వరకు, అంటే 40 శాతానికి తక్కువ మందికి మాత్రమే వాటర్ మీటర్లు ఉండడం గమనార్హం. HMWSSB రికార్డుల ప్రకారం మీటర్లు అంతంత మాత్రమే ఉండటంతో నల్లాలకు మోటర్లు పెట్టి నీటిని లాగేస్తున్నా తెలియని పరిస్థితి. నీటి ఎద్దడికి ఇదొక కారణంగా కనిపిస్తోంది. దీనిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News April 22, 2025

HYD: అమర్నాథ్ యాత్ర.. ఇవి తప్పనిసరి!

image

అమర్నాథ్ యాత్రకు వెళ్లేవారికి గాంధీలో ప్రతి సోమ, బుధ, శుక్రవారాలలో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. పలు వైద్య పరీక్షలు మాత్రం తప్పనిసరి చేయించుకోవాలి. CBP/ESR, సీయూఈ, ఈసీజీ, చెస్ట్ ఎక్స్ రే, ఎస్ క్రియేటినిన్, ఎఫ్బీఎస్/పీఎల్బీఎస్, బ్లడ్ గ్రూప్‌తో పాటు 50 ఏండ్లు పైబడినవారికి తమ 2 మోకాళ్ల ఎక్స్ రే అవసరం. అప్లికేషన్‌ మీద ఫొటో పెట్టి గాంధీలో ఇస్తే మెడికల్ సర్టిఫికెట్ ఇస్తారు. 
SHARE IT

News April 22, 2025

HYDలో SRనగర్‌ CI ది గ్రేట్

image

రూల్స్ ఫాలో అవకపోతే ట్రాఫిక్ పోలీసులు ఎంత కఠినంగా ఉంటారో తెలిసిందే. నగరవాసులకు ఆపద వస్తే మాత్రం అంతకుమించి మానవత్వం చూపిస్తారు. అలాంటి ఘటనే మన SRనగర్‌లో జరిగింది. ఉమేశ్ చంద్ర విగ్రహం వద్ద సోమవారం ఓ మైనర్‌ వాహనం నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. విధుల్లో ఉన్న CI సైదులు ఇది గమనించాడు. బాలుడిని పైకి లేపి FIRST AID చేశారు. ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించారు. బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి, ఇంటికి పంపారు.

News April 22, 2025

Inter Resluts: HYD విద్యార్థులకు ALERT

image

నేడు మ. 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తారు. మన హైదరాబాద్ జిల్లాలో ఇంటర్ ఫస్టియర్‌లో 90,351 విద్యార్థులకు 87,523 మంది పరీక్ష రాశారు. సెకండియర్‌లో 77,495 విద్యార్థులకు 75,083 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం నేడు తేలనుంది. రిజల్ట్ చూసుకునేందుకు నెట్ సెంటర్లకు వెళ్లే పని లేదు.. మొబైల్ ఉంటే చాలు. మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి Way2Newsలో చెక్ చేసుకోండి.
SHARE IT

error: Content is protected !!