News August 22, 2025
HYD: 42 ఏళ్ల పాలిటెక్నిక్ కాలేజ్ పరిస్థితి ఇదీ..!

రామంతపూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇందిరా బ్లాక్ భవనం ప్రమాదకరంగా మారింది. 42 ఏళ్ల చరిత్ర కలిగిన కళాశాలలో అనేక భవనాల పరిస్థితి అధ్వాన స్థితికి చేరింది. ప్రభుత్వ యంత్రాంగం నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. పాలిటెక్నిక్ కాలేజ్ అన్ని భవనాలకు మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Similar News
News August 22, 2025
SSS: నూతన బార్ పాలసీకి నోటిఫికేషన్ విడుదల

శ్రీ సత్యసాయి జిల్లాలో 12 బార్ల ఏర్పాటుకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ధర్మవరం 03, హిందూపూర్ 04, కదిరి 03, పెనుకొండ 01, మడకశిరలో 01 కొత్త బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారి గోవింద నాయక్ శుక్రవారం తెలిపారు. అమ్మకాల సమయాన్ని పెంచుతూ నిర్ణయించామన్నారు. ఈనెల 26 వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
News August 22, 2025
లైసెన్స్ లేని కేబుళ్లన్నీ తీసేయండి: హైకోర్టు

TG: హైదరాబాద్‌లో కేబుళ్ల తొలగింపు నేపథ్యంలో ఎయిర్‌టెల్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక కీలక ఆదేశాలు జారీ చేశారు. లైసెన్స్ తీసుకున్న కేబుళ్లు తప్ప ఏవీ ఉంచవద్దని స్పష్టం చేశారు. ఇష్టానుసారంగా కేబుళ్లు ఏర్పాటు చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనన్నారు. కాగా ఇటీవల Dy.CM భట్టి ఆదేశాలతో HYDలో కేబుల్, ఇంటర్నెట్ వైర్లు కట్ చేసిన విషయం తెలిసిందే.
News August 22, 2025
రాజంపేట: అయ్యో పాపం..!

ఆ 8మంది సరదాగా ఈతకు వెళ్లారు. సంతోషంగా గడుపుతున్న వేళ ప్రమాదం దరి చేరింది. కళ్ల ముందే స్నేహితులు నీటిలో మునిగిపోయారు. ఒకదాని తర్వాత మరొక మృతదేహాలను వెలికి తీసి ఒడ్డున వేస్తుంటే ఆపుకోలేని దుఃఖంతో కుమిలిపోయారు. ఎదిగొచ్చిన బిడ్డలు విగతజీవులుగా మారిపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. బోరున విలపించారు. చెయ్యేరు నదిలో ముగ్గురు విద్యార్థుల <<17476364>>మృతికి <<>>సంబంధించిన విషాద గాథ ఇది.