News May 8, 2024
HYD: 480 కరెంట్ ఫీడర్ ఏరియాల్లో సమస్యలు..!
HYDలో కురిసిన వర్షం, ఈదురుగాలులకు దాదాపు 480 ఫీడర్ ఏరియాల్లో కరెంట్ సమస్యలు ఏర్పడ్డాయి. నగరంలో 4000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ కాస్త రాత్రి ఒక్కసారిగా..1000 మెగావాట్లకు పడిపోయింది. దాదాపుగా 300 ఫీడర్ ఏరియాల్లో అధికారులు మరమ్మతులు చేపట్టి సమస్యలకు చెక్ పెట్టారు. మిగతా ప్రాంతాల్లోనూ కరెంట్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి 2021లో ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News January 16, 2025
రంగారెడ్డి జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా
రంగారెడ్డి జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. చందనవెల్లి 14.3℃, రెడ్డిపల్లె 14.7, తాళ్లపల్లి 15, కాసులాబాద్ 15.2, కేతిరెడ్డిపల్లి, షాబాద్, ధర్మసాగర్ 15.5, కందువాడ 15.7, మొగలిగిద్ద 15.9, ఎలిమినేడు 16.1, తొమ్మిదిరేకుల, వెల్జాల, షాద్‌నగర్ 16.3, రాచలూరు 16.4, ప్రొద్దుటూరు, అమీర్‌పేట్, మంగళ్‌పల్లి 16.6, రాజేంద్రనగర్ 16.7, నందిగామ 16.8, సంగం, మొయినాబాద్ 16.9, శంకర్పల్లి 17, HCUలో 17.1గా నమోదైంది.
News January 16, 2025
HYD దగ్గరలో అందమైన టూరింగ్ స్పాట్
వికారాబాద్ జిల్లాలోని కోట్‌పల్లి రిజర్వాయర్ వీకెండ్ టూరిస్ట్ స్పాట్‌గా మారింది. ఇక్కడ బోటింగ్ చేస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ స్పోర్ట్స్ టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ 30 నిమిషాలకు సింగిల్ సీటర్‌కిరూ.300, డబుల్ సీటర్‌కి రూ.400గా నిర్ణయంచారు. ఈ బోటింగ్ సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. 10 ఏళ్లలోపు పిల్లలకు ప్రవేశం లేదు.
News January 16, 2025
3 రోజుల్లో నుమాయిష్‌కు 2,21,050 మంది
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు 3 రోజుల్లో మొత్తం 2,21,050 మంది సందర్శకులు తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి రోజు ఎక్కువగా 76,500 మంది నుమాయిష్‌కు రాగా.. ఎగ్జిబిషన్‌లోని అన్ని స్టాల్స్ జనసంద్రంగా మారాయి. పాఠశాలలకు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో మరో 2 రోజులు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.