News December 11, 2024

HYD: 5 రోజుల పాటు రాష్ట్రపతి పర్యటన

image

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News December 9, 2025

హైదరాబాద్‌లో కొత్త ట్రెండ్

image

హైదరాబాద్‌లోనూ ప్రస్తుతం ‘భజన్ క్లబ్బింగ్’ జోరుగా సాగుతోంది. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ నైట్స్ స్థానంలో యువత ఎంచుకుంటున్న కొత్త ట్రెండ్ ఇది. ​’మీనింగ్‌ఫుల్ పార్టీ’ అంటే ఇదే అంటున్నారు. ఆల్కహాల్ తీసుకోకుండా హై-ఎనర్జీ కీర్తనలు, భజన్ జామింగ్ సెషన్స్ లాంటి భక్తి పాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. డిస్కో లైటింగ్, DJ నడుమ గ్రూప్ సింగింగ్‌తో మైమరిచిపోతున్నారు. ​ఈ ట్రెండ్‌పై మీ అభిప్రాయం ఏంటి?

News December 9, 2025

రాష్ట్ర ప్రభుత్వం, బంటియా ఫర్నిచర్స్ మధ్య ఒప్పందం

image

రాష్ట్ర ప్రభుత్వం, బంటియా ఫర్నిచర్స్ మధ్య అధికారికంగా ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో దీనికి సంబంధించి (MoU)పై ఇరువురు ప్రతినిధులు సంతకం చేశారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. బంటియా ఫర్నిచర్స్ మరో మైలురాయిని ప్రకటించడానికి సంతోషంగా ఉందని చెప్పారు. రూ.511 కోట్ల విలువైన ఈ ముఖ్యమైన సహకారం రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని గణనీయంగా బలోపేతం చేయనుందని వెల్లడించారు.

News December 9, 2025

HYD: ప్చ్.. ఈ సమ్మర్‌లో బీచ్‌ కష్టమే!

image

రూ.225 కోట్లతో 35 ఎకరాల్లో కొత్వాల్‌గూడలో మొట్టమొదటి కృత్రిమ బీచ్‌ ప్రతిపాదన ఈ వేసవికి కూడా కలగానే మిగిలేలా ఉంది. వేవ్ టెక్నాలజీతో కూడిన మ్యాన్‌మేడ్ సరస్సు, ఫ్లోటింగ్ విల్లాలు, లగ్జరీ హోటళ్లు, అడ్వెంచర్స్, థియేటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. రూ.15,000 కోట్ల పర్యాటక సామర్థ్యాన్ని పెంచేలా DEC నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, వచ్చే ఏడాది మార్చిలోనే పనులు ప్రారంభంకానున్నట్లు సమాచారం.