News May 12, 2024

HYD: 500 చెట్లను తిరిగి నాటేలా చర్యలు 

image

HYD చర్లపల్లి రైల్వే టర్మినల్ సంబంధించి అధికారులు ఓ ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ తెలిపారు. స్టేషన్ పునరుద్ధరణ సమయంలో దాదాపుగా 500 చెట్లను తొలగించి, నార్త్ లాలాగూడ, మౌలాలి, ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో వాటిని మళ్లీ నాటినట్లుగా పేర్కొన్నారు. పర్యావరణంపై ఉన్న ప్రేమతో చెట్లను నరికి వేయకుండా, ఈ విధంగా చేసినట్లు వెల్లడించారు. మరోవైపు చర్లపల్లి రైల్వే స్టేషన్లో 5,500 మొక్కల పెంపునకు శ్రీకారం చుట్టారు.

Similar News

News February 18, 2025

HYD: మనవడి చేతిలో తాత హత్య.. కత్తి స్వాధీనం 

image

HYDలోని సోమాజిగూడలో మనవడి చేతుల్లో తాత జనార్దనరావు హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే పోలీసులు మనవడు కీర్తితేజను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా.. పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 4 రోజుల కస్టడీ సోమవారం ముగియగా.. బీఎస్ మక్తాలోని ప్రార్థన మందిరం సమీపంలో హత్యకు ఉపయోగించిన కత్తి, ధరించిన దుస్తులను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. కాగా మంటల్లో కాలిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News February 18, 2025

HYD: భార్యను పంపమని ఆమె భర్తనే అడిగాడు..!

image

పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి నిప్పంటించుకున్న ఘటన మధురానగర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. యాదగిరినగర్‌లో దంపతులు నివాసం ఉంటున్నారు. భార్యకు సూర్యనారాయణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మద్యం తాగి ఇంటికి వచ్చి ‘మీ భార్యను నాకు ఇచ్చేయ్, జీవితాంతం సంతోషంగా చూసుకుంటా’అని భర్తతో అన్నాడు. భర్త ఆగ్రహించడంతో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News February 18, 2025

HYD: రేపు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. HYDలో వివిధ సంఘాలు సమావేశం అయ్యాయి. ఛత్రపతి సేవలు నేటి తరానికి తెలియజేయాలని కోరారు. ప్రతీ హిందువు శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర తెలుసుకోవాలన్నారు. హిందువుల మనోభావాలకు అనుకూలంగా ఆయన జయంతి (ఫిబ్రవరి 19)కి సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

error: Content is protected !!