News February 13, 2025
HYD: 500 పాఠశాలల్లో AI బోధనకు కృషి: సీఎం

గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 500 పాఠశాలల్లో ఏఐ బోధనకు కృషి చేస్తున్నామని, HYDతో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌దే అని పేర్కొన్నారు.
Similar News
News March 25, 2025
మేడ్చల్: బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని SUICIDE

క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని ఓ వ్యక్తి HYDలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం.. మండల పరిధిలోని గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్ (29) క్రికెట్ బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకొని మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం గౌడవెల్లి పరిధిలో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News March 25, 2025
BRS సభ వేదిక ఘట్కేసర్‌కి మార్పు!

BRS రజతోత్సవాల నేపథ్యంలో ఏప్రిల్ 27న నిర్వహించే బహిరంగ సభ వేదికను మార్పు చేస్తున్నట్లు సమాచారం. వేసవి తీవ్రత సందర్భంగా పార్కింగ్ సదుపాయాలు అన్ని జిల్లాల నుంచి రవాణా సదుపాయం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం, తాజా సభ కోసం HYD శివారు ఘట్కేసర్ వద్ద ప్రముఖ ప్రైవేట్ స్కూల్ వెనక ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు సమాచారం, ఉంది. ఉంది…!
News March 25, 2025
MMTS అత్యాచారయత్నం.. నిందితుడి గుర్తింపు

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన మహేశ్‌గా గుర్తించారు. జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూపించడంతో తనపై లైంగిక దాడికి యత్నించింది మహేశేనని యువతి గుర్తించింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.