News February 13, 2025

HYD: 500 పాఠశాలల్లో AI బోధనకు కృషి: సీఎం

image

గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 500 పాఠశాలల్లో ఏఐ బోధనకు కృషి చేస్తున్నామని, HYDతో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌దే అని పేర్కొన్నారు.

Similar News

News March 28, 2025

పెద్దపల్లి: రేషన్‌షాపుల్లో సన్నబియ్యం.. అక్రమ రవాణాకు సెల్ఫ్ బ్రేక్

image

రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనుంది. దీంతో పెద్దపల్లి జిల్లాలో 2,19,952 మంది లబ్ధిదారులకు లబ్ధి జరగనుంది. ఇది వరకు రేషన్‌షాపుల్లో దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. దీంతో చాలామంది లబ్ధిదారులు వాటిని అమ్ముకునేందుకు మొగ్గుచూపే వారు. ఇక నుంచి సన్నబియ్యం రేషన్ షాపుల్లో పంపిణీ చేయడంతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సెల్ఫ్ బ్రేక్ పడినట్టయ్యింది.

News March 28, 2025

కొనకనమిట్ల: తమ్ముడి కళ్ల ఎదుటే అన్న మృతి

image

చిలకలూరిపేట బైపాస్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కొనకనమిట్ల(M) సిద్దవరానికి చెందిన చప్పిడి రమేశ్ (25) తమ్ముడు చిన్నాతో బైకుపై వెళ్తున్నారు. ముందుగా వెళుతున్న లారీని బైక్ ఢీకొట్టడంతో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నాకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో తమ్ముడి కళ్లదుటే అన్న మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 28, 2025

HYD: అసైన్మెంట్ గడువు పొడిగింపు

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం జి.రామ్ రెడ్డి దూర విద్యలో UG, PG విద్యార్థులకు అసైన్మెంట్ గడువు ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. అధికారిక ప్రకటన విడుదల చేసిన అధికారులు, ఇది తుదిగడువు అని స్పష్టం చేశారు. నిర్ణీత సమయానికి సమర్పించని విద్యార్థుల అసైన్మెంట్లు తిరస్కరిస్తామని హెచ్చరించారు. గడువు దాటిన తర్వాత ఎలాంటి పొడిగింపు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

error: Content is protected !!