News March 14, 2025
HYD: 5K రన్కు హాజరు కావాలని వినతి

ఆదివారం ఉదయం 6 గంటలకు ఆల్విన్కాలనీ 124 డివిజన్ పరిధిలోని తులసి వనంలో అవని ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 5K రన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రులు జూపల్లి కృష్ణరావు, పొన్నం ప్రభాకర్ను కలసి అవని ట్రస్ట్ ఛైర్మన్ శిరీష సత్తూర్ ఆహ్వానించారు. ఆదివారం ఉ.6 గంటల కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆమె వెల్లడించారు.
Similar News
News January 8, 2026
నిర్మల్: బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి: TRP

రాష్ట్రంలోని బీసీలందరికీ సామాజిక న్యాయం జరగాలంటే వెంటనే బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేసింది. గురువారం నిర్మల్ కలెక్టరేట్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు గైని సాయి మోహన్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీల సంక్షేమం కోసం బడ్జెట్లో జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలన్నారు.
News January 8, 2026
సంక్రాంతికి ఊర్లు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలి: ఎస్పీ

సంక్రాంతి సందర్భంగా ఊర్లు వెళ్లేవారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుహీన్ సిన్హా సూచించారు. బంగారు ఆభరణాలు ఇతర విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించారు. నగదు ఇంట్లో ఉంచవద్దన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఊర్లకు వెళ్లేవారు సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు.
News January 8, 2026
చిత్తూరు: హంతకుడు నేషనల్ క్రికెటర్ గణేశేనా.?

ఆయన వికలాంగుడు.. <<17815171>>దేశానికి<<>> ఆడుతుంటే అందరూ శభాష్ అన్నారు. విజయం ఇచ్చిన <<18790831>>గర్వమో<<>>, మానవత్వం మరిచాడో ప్రేయసిని చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. SRపురానికి చెందిన క్రికెటర్ గణేశ్ కవితను చంపి నీవా నదిలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె కూడా వికలాంగురాలు. వీరి మధ్య ఇది వరకే పెళ్లి ప్రస్తావనపై గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.


