News March 14, 2025
HYD: 5K రన్‌కు హాజరు కావాలని వినతి

ఆదివారం ఉదయం 6 గంటలకు ఆల్విన్‌కాలనీ 124 డివిజన్ పరిధిలోని తులసి వనంలో అవని ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 5K రన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రులు జూపల్లి కృష్ణరావు, పొన్నం ప్రభాకర్‌ను కలసి అవని ట్రస్ట్ ఛైర్మన్ శిరీష సత్తూర్ ఆహ్వానించారు. ఆదివారం ఉ.6 గంటల కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆమె వెల్లడించారు.
Similar News
News February 11, 2026
ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్

ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల ఓటర్లు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ హరిత కోరారు. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, 100 శాతం పోలింగ్ నమోదుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సెలవును వృథా చేయకుండా రాజ్యాంగం కల్పించిన హక్కును చాటుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓటర్లు నిర్భయంగా తరలిరావాలని ఆమె సూచించారు.
News February 11, 2026
సేవా రంగంలో గుంటూరు టాప్.. మిగతావాటిలో వెనుకబాటు

సేవా రంగంలో గుంటూరు జిల్లా 97 స్కోరుతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ‘A+’ గ్రేడ్ సాధించింది. కానీ, టీనేజ్ గర్భధారణల్లో (8-10%) జిల్లా ఆందోళనకర స్థాయిలో ఉండటం గమనార్హం. పదో తరగతి అసెస్‌మెంట్‌లోనూ విద్యార్థులు C, D గ్రేడ్లకే పరిమితమయ్యారు. మరోవైపు, రైల్వే బ్రిడ్జిల (ROB) పనులు నత్తనడకన సాగుతున్నాయి. భూసేకరణ సమస్యలతో జాప్యం జరుగుతోంది. వీటిపై దృష్టి సారించకపోతే ఇబ్బందులు తప్పవు.
News February 11, 2026
స్పీకర్‌పై ‘అవిశ్వాసం’.. ఇప్పుడేం జరుగుతుంది?

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస <<19101605>>తీర్మానానికి<<>> ప్రతిపక్షాలు నోటీసులివ్వడం తెలిసిందే. ముందుగా తీర్మానంలో వాడిన భాషను డిప్యూటీ స్పీకర్/ప్యానల్ ఛైర్ పర్సన్ పరిశీలిస్తారు. 14 రోజుల తర్వాత సభ పరిశీలనకు తీర్మానం వస్తుంది. ఈ సమయంలో సభకు స్పీకర్ నేతృత్వం వహించరు. తనపై మోపిన అభియోగాలపై మాట్లాడేందుకు, తన చర్యలను సమర్థించుకునేందుకు స్పీకర్‌కు అవకాశం ఉంటుంది. 10 రోజుల్లోగా లోక్‌సభలో చర్చించి తేల్చాల్సి ఉంటుంది.


