News March 14, 2025

HYD: 5K రన్‌కు హాజరు కావాలని వినతి

image

ఆదివారం ఉదయం 6 గంటలకు ఆల్విన్‌కాలనీ 124 డివిజన్ పరిధిలోని తులసి వనంలో అవని ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 5K రన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రులు జూపల్లి కృష్ణరావు, పొన్నం ప్రభాకర్‌ను కలసి అవని ట్రస్ట్ ఛైర్మన్ శిరీష సత్తూర్ ఆహ్వానించారు. ఆదివారం ఉ.6 గంటల కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆమె వెల్లడించారు.

Similar News

News January 3, 2026

బాపట్ల: KGBV నోటిఫికేషన్.. ఖాళీల వివరాలు

image

బాపట్ల జిల్లాలో 4 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్-3 కస్తూర్బాగాందీ విద్యాలయాల్లో (KGVB) 4 ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.

News January 3, 2026

అన్నమయ్య: డ్రోన్ కెమెరాతో తనిఖీలు

image

అన్నమయ్య జిల్లాలోని విద్యాసంస్థల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచి ఆకతాయిల ఆటకట్టిస్తున్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. మదనపల్లె, పీలేరు, రాయచోటి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని విద్యా సంస్థలవద్ద డ్రోన్‌తో శుక్రవారం తనిఖీలు చేశారు. ఆకతాయిల ఆగడాలు, ఈవ్ టీజింగ్‌ను అరికడతామన్నారు.

News January 3, 2026

అల్లూరి జిల్లాలో 106 ఉద్యోగాలు.. వివరాలు ఇలా

image

అల్లూరి జిల్లాలో 106 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్-3 కస్తూర్బాగాందీ విద్యాలయాల్లో(KGVB) 39, టైప్-4 కేజీబీవీల్లో 67 పోస్టింగ్‌లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.