News April 1, 2024
HYD: 6 నుంచి దూరవిద్య పబ్లిక్ పరీక్షలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) సెకండరీ(పదో తరగతి), సీనియర్ సెకండరీ(12వ తరగతి) పబ్లిక్ పరీక్షలు ఈనెల 6 నుంచి మే 22వరకు నిర్వహించనున్నట్లు NIOS HYD ప్రాంతీయ సంచాలకులు పి.సుబ్రమణ్యం తెలిపారు. విద్యార్థులు పరీక్ష తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌తో పాటు హాల్టికెట్లను NIOS వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం 040-24752859, 24750712నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Similar News
News January 14, 2025
HYD: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో..
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 9100153883 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.
News January 13, 2025
HYD: మిసెస్ ఇండియా తెలంగాణగా మిథాలీ అగర్వాల్
హైదరాబాద్ వేదికగా నిర్వహించిన మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణకు చెందిన మిథాలీ అగర్వాల్.. మిసెస్ ఇండియా తెలంగాణగా నిలిచారు. అండర్ 40లో 3వ స్థానంలో నిలిచి ఆమె రన్నరప్లో నిలిచారు. మిసెస్ మమత త్రివేది నిర్వహించిన ఈ ఈవెంట్‌లో వివిధ వయసు కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. మిథాలీ అగర్వాల్ గతంలో ఐఐటీ హైదరాబాద్ PROగా విధులు నిర్వహించారు. ఆమె విజయంపై పలువురు అభినందనలు తెలిపారు.
News January 13, 2025
HYD: రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సుల రయ్ రయ్..!
హైదరాబాద్‌లోని ఉప్పల్, KPHB, ఎల్బీనగర్ క్రాస్ రోడ్, గచ్చిబౌలి, JBS, MGBS నుంచి హనుమకొండ, వరంగల్, తొర్రూరు, కరీంనగర్, సిద్దిపేట వెళ్లే రోడ్డు మార్గంలో RTC ఎలక్ట్రిక్ బస్సులు రయ్ రయ్ మంటూ.. తిరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో 3,200 ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. వారం క్రితమే నూతన ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించారు.