News March 14, 2026

HYD: 600 ఎకరాల భూమి వేలం!

image

బడ్జెట్‌లో నిధుల లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వం నగర శివార్లలోని ప్రభుత్వ భూములను విక్రయించేందుకు సిద్ధమైంది. కోకాపేట, బుద్వేల్ తర్వాత ఇప్పుడు ‘కిస్మత్‌పూర్’, ‘తారామతి-బారామతి’ పరిసరాల్లోని సుమారు 600 ఎకరాల వివాదరహిత భూములను వేలం వేయాలని కేబినెట్ రహస్యంగా నిర్ణయించింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. కనీసం ₹15,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.

Similar News

News March 15, 2026

Breaking: కొత్త చిక్కుల్లో తాండూరు మాజీ MLA

image

తాండూరు మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి పేరు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో MLAల కొనుగోలు కేసు, ఇప్పుడు ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతంతో ఆయన కొత్త చిక్కుల్లో పడ్డారు. ఈగల్ టీమ్ దాడులు, పోలీసులు పైలట్‌ను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. దీనికితోడు పోలీసులపై కాల్పులు.. ఆ రివాల్వర్ కూడా అతడి సోదరుడు రితేశ్ రెడ్డిది అని వార్తలు రావడం గమనార్హం.

News March 15, 2026

ఖమ్మం: తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం

image

కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలో బొలెరో వాహనం పల్టీ కొట్టడంతో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదుటి వాహనాన్ని తప్పించబోయే సమయంలో నియంత్రణ కోల్పోయి ప్రమాదం సంభవించింది. ఘటనలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. టైల్స్ లోడుతో బొలెరో హైదరాబాద్ నుంచి అశ్వరావుపేటకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కోయమాదారానికి చెందినవారని సమాచారం.

News March 15, 2026

చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరల వివరాలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.182 నుంచి రూ.186, మాంసం రూ.264 నుంచి 295 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.300 నుంచి రూ.320 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.