News July 3, 2024
HYD: 7 నుంచి అంధ అభ్యర్థులకు నిర్ధారణ పరీక్షలు

గ్రూప్-4 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనలో భాగంగా అంధ అభ్యర్థులు వైద్య పరీక్షల నిమిత్తం హాజరు కావాల్సి ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ఈ.నవీన్ నికోలస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంధ అభ్యర్థులు ఈనెల 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మెహిదీపట్నం సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు ఎదుట ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
Similar News
News November 22, 2025
HYD: ఐబొమ్మ రవి కేసులో సీఐడీ రంగ ప్రవేశం

ఐబొమ్మ రవి కేసులో తెలంగాణ సీఐడీ ఎంట్రీ ఇచ్చింది. గేమింగ్, బెట్టింగ్ యాప్లను రవి ప్రమోట్ చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించాడు. నాలుగు బెట్టింగ్ యాప్లను రవి ప్రమోషన్ చేశాడు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గర నుంచి సీఐడీ సేకరించింది. రవి ఆర్థిక లావాదేవీలపైనా వివరాలు సేకరిస్తోంది. ఇప్పటికే బెట్టింగ్ ప్రమోషన్ కేసులపై సీఐడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
News November 22, 2025
HYD: వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం ఎంతో అవసరం: సీపీ

వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం ఎంతో అవసరమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. శుక్రవారం ఆయన పోలీస్ సిబ్బంది కోసం నిర్వహిస్తున్న పాతబస్తీ పేట్ల బురుజు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసులు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడం ఎంతో అవసరమన్నారు.
News November 22, 2025
HYD: నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి

నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి హాజరుకానుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మంచు లక్ష్మిని సీఐడీ అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే ఈడీ విచారణను మంచులక్ష్మి ఎదుర్కొనగా.. మధ్యాహ్నం సీఐడీ సిట్ ఎదుట మంచు లక్ష్మి హాజరుకానున్నారు. కాగా, ఇప్పటికే రానా, విష్ణు ప్రియలను విచారించిన విషయం తెలిసిందే.


