News August 25, 2025
HYD: 70 మంది పోకిరీల పనిపట్టిన షీ టీమ్స్

మహానగరంలో పోకిరీల బెడద నుంచి కాపాడాలని సైబరాబాద్ షీ టీమ్స్‌కు పలువురు ఫోన్ చేసే సహాయం అర్థిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు షీటీమ్స్ సిబ్బంది 143 డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించారు. అసభ్యకరంగా వేధిస్తున్న 70 మందిని పట్టుకున్నట్లు డీసీపీ సృజన కరణం తెలిపారు. అంతేకాక 34 మంది భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వివరించారు. బాధితులు 181, 1098కు ఫోన్ చేసి చెప్పాలని ఈ సందర్భంగా సూచించారు.
Similar News
News August 25, 2025
గణేశ్ నిమజ్జనానికి GHMC భారీ ఏర్పాట్లు

హుస్సేన్‌సాగర్‌తో సహా HYDలోని 66 చెరువులు, కుంటల్లో GHMC నిమజ్జనానికి ఏర్పాట్లు చేసింది. 41 కృత్రిమ పాయింట్లను ఏర్పాటు చేసింది. 3.10 లక్షల మట్టి గణేశ్ విగ్రహాలు పంపిణీ చేయనుంది. నిమజ్జనానికి 140 స్టాటిక్, 295 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు. 160 గణేశ్ యాక్షన్ టీమ్‌లు, 14,486 పారిశుద్ధ్య కార్మికులు రంగంలోకి దిగనున్నారు. 13 కంట్రోల్ రూములు, 309 మొబైల్ టాయిలెట్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.
News August 25, 2025
నగరంలో లాగింగ్ పాయింట్లు 3 రెట్లు పెరిగాయి

నగరంలో వర్షం వస్తే బయటకు వెళ్లాలంటేనే భయం. కారణం వాటర్ లాగింగ్ పాయింట్లు HYDలో పెరగడం గతంలో వాటర్ లాగింగ్ పాయింట్లు 144 ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 436కు పెరిగినట్లు తేలింది. దీంతో అధికారుల్లో ఒక రకమైన ఆందోళన, అన్ని చోట్లా నీరు నిలిచిపోతే నగరం ఏమైపోతుందన్న భయం.. ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల సర్వేలో ఈ వివరాలు తెలిశాయని సమాచారం.
News August 25, 2025
దేశంలోనే TG హైకోర్టు టాప్.. 9వ స్థానంలో ఏపీ

మహిళా న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు దేశంలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. 33.3% మహిళా జడ్జీలు ఇక్కడ సేవలందిస్తున్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో మొత్తం 30 మంది జడ్జీలు ఉండగా 10 మంది అంటే 33.3% మంది మహిళా జడ్జిలు ఉన్నారు. అదే ఏపీలో 30 మందికి గానూ 16.67 % అంటే ఐదుగురే ఉండటంతో జాబితాలో 9వ స్థానంలో నిలిచింది. సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసర్చ్ నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.