News March 22, 2024
HYD: 72.88 లీటర్ల అక్రమ లిక్కర్ సీజ్: రోనాల్డ్ రోస్

ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ గురువారం 72.88 లీటర్ల అక్రమ లిక్కర్, రూ.38,150/- విలువైన ఇతర వస్తువులు జప్తు చేసినట్లు HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. పోలీస్, ఎస్.ఎస్.టీ., ఎఫ్.ఎస్.టీ. బృందాలు క్షేత్ర స్థాయిలో 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. HYDలో ఇప్పటి వరకు మొత్తం రూ.47,18,300 నగదు పట్టుకున్నట్లు వెల్లడించారు.
Similar News
News November 16, 2025
శంషాబాద్: విమానంలో స్మోకింగ్ చేసిన ప్రయాణికుడు

విమానంలో పొగ తాగిన ప్రయాణికుడిని ఎయిర్ లైన్స్ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. పోలీసుల వివరాలు.. రియాద్ నుంచి ఇండిగో విమానంలో శనివారం ఓ ప్రయాణికుడు శంషాబాద్కు వచ్చారు. ఈ క్రమంలో విమానంలోని మరుగుదొడ్డిలో పొగ తాగినట్లు ఎయిర్లైన్స్ సిబ్బంది గుర్తించి ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 16, 2025
HYD: కులాంతర వివాహం.. పెట్రోల్ పోసి తగులబెట్టారు!

కులాంతర వివాహానికి సహకరించాడని హత్య చేసిన ఘటన షాద్నగర్లో జరిగింది. బాధితుల ప్రకారం.. ఎల్లంపల్లివాసి చంద్రశేఖర్ అదే గ్రామానికి చెందిన యువతిని 10రోజుల క్రితం ప్రేమపెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో చంద్రశేఖర్ వివాహానికి అన్న రాజశేఖర్ సహకరించాడని భావించి యువతి బంధువులు 12న రాజశేఖర్ను మాట్లాడదామని పిలిచి కొట్టి హతమార్చారు. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News November 16, 2025
త్వరలో HYDలో ఎనిమీ ప్రాపర్టీ ప్రాంతీయ కార్యాలయం

రాష్ట్రంలో ఎనిమీ ప్రాపర్టీలు పరిరక్షణ కోసం HYDలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ముంబై ప్రాంతీయ కార్యాలయం తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల వ్యవహారాలు చూస్తోంది. హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల్లో ఎనిమీ ప్రాపర్టీలపై రెవెన్యూశాఖ సర్వే నిర్వహించింది. మియాపూర్ పరిధిలో వందల ఎకరాలు ఉండగా, కొంతభాగం అక్రమ ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు.


