News March 22, 2024
HYD: 72.88 లీటర్ల అక్రమ లిక్కర్ సీజ్: రోనాల్డ్ రోస్
ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్ గురువారం 72.88 లీటర్ల అక్రమ లిక్కర్, రూ.38,150/- విలువైన ఇతర వస్తువులు జప్తు చేసినట్లు HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. పోలీస్, ఎస్.ఎస్.టీ., ఎఫ్.ఎస్.టీ. బృందాలు క్షేత్ర స్థాయిలో 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. HYDలో ఇప్పటి వరకు మొత్తం రూ.47,18,300 నగదు పట్టుకున్నట్లు వెల్లడించారు.
Similar News
News September 19, 2024
BREAKING..HYD: టెండర్లు ఆహ్వానిస్తున్న హైడ్రా
కూల్చివేతల వ్యర్థాల తొలగింపునకు హైడ్రా టెండర్లు ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తున్నట్లు తెలిపింది. నేటి నుంచి ఈనెల 27 వరకు బిడ్లు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 23 చోట్ల 262 నిర్మాణాలను కూల్చివేసిన విషయాన్ని ఇదివరకే ప్రకటించింది.
News September 19, 2024
HYD: పాత నేరస్థులతో ముఠా ఏర్పాటు.. వేషాలు మార్చి చోరీలు
<<14135182>>మారు వేషాలతో<<>> చోరీలకు పాల్పడుతున్న ముఠా పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. నిందితుడు సుధాకర్(33) నంద్యాల నుంచి ఇక్కడికి వచ్చి ఆటో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. ఓ కేసులో జైలుకెళ్లి అక్కడ పాత నేరస్థుడు బండారిని కలిసి మరికొంత మందితో గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. వారు మహిళల్లా వేషాలు మార్చి చోరీలకు పాల్పడి సొత్తును సోదరుడు సురేశ్‌కు ఇచ్చి నగదు రూపంలోకి మర్చుకునేవారని తెలిపారు.
News September 19, 2024
HYD: నవోదయ ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు పొడిగింపు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గచ్చిబౌలి నవోదయ విద్యాలయం ప్రధానాచార్యుడు డి.విజయ్ భాస్కర్ శుభవార్త చెప్పారు. జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష గడువును పొడిగించినట్లు వెల్లడించారు. జనవరి 18న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు దరఖాస్తు గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించారు. ఆన్‌లైన్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.