News June 6, 2024
HYD: 8న చేప ప్రసాదం పంపిణీ

మృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబం ఈ నెల 8న అందించే చేప మందు ప్రసాదం పంపిణీకి ఆర్అండ్బీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కౌంటర్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో క్యూలైన్ల కోసం బారికేడ్లు, విద్యుద్దీపాలు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి పనులను చేపట్టారు.
Similar News
News September 16, 2025
ఓయూ: 22 నుంచి నూతన కోర్సు ప్రారంభం

ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలోని ది సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రెయినింగ్(సెల్ట్)లో ‘ఇంగ్లిష్ కమ్యునికేషన్ స్కిల్స్& పర్సనాలిటీ డెవలప్మెంట్’ కోర్సు ప్రారంభిస్తున్నారు. తరగతులు సా.6 నుంచి 7:30 గంటల వరకు ఉంటాయి. ఆసక్తిగల వారు ఈ నెల 20లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సెల్డ్ డైరెక్టర్ ప్రొ.సవీన్ సౌద తెలిపారు. 7989903001 నంబరుకు ఫోన్ చేయొవచ్చు.
# SHARE IT
News September 16, 2025
HYD: నేటి నుంచి TGలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత

నేటి నుంచి TGలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయ్యనున్నారు. రూ.1,400 కోట్ల బకాయిలు ఉన్నట్లు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. గత 20 రోజులుగా ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం ఆయాయి. దీంతో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 330 ఆస్పత్రులకు గత 12 నెలలుగా బకాయిలు పెండింగ్ ఉండడంతో వెంటనే చెల్లించాలని సేవలు నిలిపివేయన్నున్నారు.
News September 16, 2025
HYD: 24 గంటలు గడిచినా కనిపించనిజాడ

భారీ వర్షానికి వరద పోటెత్తడంతో ఆదివారం రాత్రి నాలాలో గల్లంతైన మాన్గార్ బస్తీకి చెందిన అర్జున్, రామా జాడ ఇప్పటివరకు లభించలేదు. ఆదివారం రాత్రి నుంచి DRF, GHMC రెస్క్యూ టీమ్లు తీవ్రంగా గాలిస్తున్నాయి. మూసీ నదిలోనూ ముమ్మరంగా గాలింపు ప్రక్రియ కొనసాగుతోంది. వారిద్దరు నాలాలో కొట్టుకొని పోవడంతో అఫ్జల్ సాగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.