News July 11, 2024
HYD: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

మేడ్చల్ జిల్లా పోక్సో కోర్టు యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పును వెలువరించింది. 2017లో 8 ఏళ్ల బాలికపై పొరుగింటి యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి 20 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష, రూ.3 లక్షల జరిమానాను విధిస్తూ జడ్జి తీర్పును వెలువరించారు.
Similar News
News February 17, 2025
HYD: నుమాయిష్ ఈరోజు లాస్ట్

HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నుమాయిష్ నేటితో ముగియనుంది. ఆదివారం సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగింది. శనివారం రికార్డు స్థాయిలో 90 వేల మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది. జనవరి 3వ తేదీన ప్రారంభమైన నుమాయిష్‌లో వందల సంఖ్యలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. రూ. 50 ఎంట్రీ ఫీజు ఉంది. 5 ఏళ్లలోపు పిల్లలకు ఉచితం. నగరవాసులు చివరిరోజు పోటెత్తే అవకాశం ఉండడంతో తగు ఏర్పాట్లు చేశారు.
News February 17, 2025
IPLకు సిద్ధమవుతోన్న ఉప్పల్ స్టేడియం!

హైదరాబాద్‌లోని క్రికెట్ ప్రియులకు గుడ్‌న్యూస్. IPLకు ఉప్పల్ స్టేడియాన్ని సర్వం సిద్ధం చేస్తున్నట్లు HCA ప్రెసిడెంట్ జగన్ తెలిపారు. స్టేడియంలో నూతనంగా సీట్లను అమర్చుతున్నారు. వెస్ట్, ఈస్ట్ స్టాండ్‌లపై అభిమానుల సౌకర్యార్థం పందిరి వేస్తున్నట్లు పేర్కొన్నారు. IPL నిర్వహణలో హైదరాబాద్ అత్యుత్తమ హోస్ట్‌గా నిలుస్తుందని, ఇందుకు కృషి చేస్తామని జగన్ వెల్లడించారు.
News February 17, 2025
HYDలో భారీగా పడిపోయిన చికెన్ ధరలు

HYDలో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ఆదివారం కిలో చికెన్ రూ. 180 నుంచి రూ. 190 వరకు అమ్మారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో మాంసం ప్రియులు మటన్, చేపల దుకాణాల వైపు మొగ్గుచూపారు. ఈ ప్రభావంతో సోమవారం ధరలు తగ్గించారు. విత్ స్కిన్ KG రూ. 148, స్కిన్‌లెస్ KG రూ. 168గా ధర నిర్ణయించారు. ఫాంరేటు రూ. 80, రిటైల్ రూ. 102 ఉంది. నిన్న ఓల్డ్ సిటీలో లైవ్ చికెన్‌ను రూ. 40కే విక్రయించినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది.