News September 23, 2024
HYD: 8 నెలల్లో 54,483 గృహాల రిజిస్ట్రేషన్లు

HYDలో 2024 జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల్లో 54,483 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక్క ఆగస్టులోనే ఏకంగా 6,439 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా 18% పెరగడం గమనార్హం. 2023లో 46,287 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడించింది.
Similar News
News November 26, 2025
HYD: బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీని ప్రశ్నించిన KTR

తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ ‘X’ లో ఘాటుగా స్పందించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని, రూ.160 కోట్లు ఖర్చు చేశామని చెప్పిన రాహుల్ గాంధీ, పంచాయతీ ఎన్నికల్లో కేవలం 17% రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని KTR ప్రశ్నించారు.
News November 26, 2025
నగరం.. మహానగరం.. విశ్వనగరం

అప్పట్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. ఇదీ సిటీ పరిస్థితి. ఇక ఔటర్ చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు గ్రేటర్లో కలిసిన తర్వాత విశ్వనగరంగా మారనుంది. జనాభా కూడా భారీగానే పెరిగే అవకాశముంది. ప్రస్తుతం గ్రేటర్ జనాభా 1.40 కోట్లు ఉండగా విలీనం తర్వాత 1.70 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.
News November 26, 2025
శివారులో మాయమైపోతున్నయమ్మ పల్లెలు

దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని పెద్దలు చెప్పేవారు.. అయితే ఇపుడు నగర శివారులో ఉన్న పల్లెలు మాయమవుతున్నాయి. అవి పట్నాలుగా కాదు.. ఏకంగా నగరంగా మారిపోతున్నాయి. సిటీ చుట్టుపక్కల ఉన్న పల్లెలు, మున్సిపాలిటీలను ప్రభుత్వం GHMCలో విలీనం చేస్తూనే ఉంది. అప్పట్లో 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న హైదరాబాద్ నగరం 2వేల చదరపు కిలోమీటర్లున్న నగరంగా మారుతోందంటే ఎన్ని పల్లెలు మాయమై ఉంటాయో ఆలోచించండి.


